పండగే పండగ:కైట్,స్వీట్ ఫెస్టివల్ ప్రారంభించిన వెంకయ్య నాయుడు

  • Edited By: chvmurthy , January 13, 2019 / 02:25 PM IST
పండగే పండగ:కైట్,స్వీట్ ఫెస్టివల్ ప్రారంభించిన వెంకయ్య నాయుడు

సికింద్రాబాద్: తెలంగాణ టూరిజంశాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న పతంగులు,స్వీట్ ఫెస్టివల్ ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ప్రారంభించారు. 3 రోజుల పాటు  జరిగే ఈఉత్సవాలలో 20 దేశాల నుంచి  42 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు, పాల్గొని  పలు డిజైన్లలో రూపోందించిన పతంగులను ఎగుర వేస్తారు.
అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్ లో  22 దేశాలు, మన దేశంలోని 25 రాష్ట్రాల నుంచి వచ్చిన స్వీట్ల తయారీదారులు దాదాపు 1200 రకాల స్వీట్లను అందుబాటులో ఉంచుతారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు కైట్ ఫెస్టివల్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రదర్శన తిలకించటానికి వచ్చేసందర్శకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జీహెచ్ఎంసీ, పోలీసు, ఇతర శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.