గుడ్ న్యూస్ : JBS నుంచి మెట్రో సర్వీసులు

నగరవాసులకు గుడ్ న్యూస్. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మెట్రో సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. మెట్రోరైలు కారిడార్‌-2కు సంబంధించి జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి ఇమ్లీబన్‌ వరకు

  • Published By: veegamteam ,Published On : August 22, 2019 / 03:00 AM IST
గుడ్ న్యూస్ : JBS నుంచి మెట్రో సర్వీసులు

నగరవాసులకు గుడ్ న్యూస్. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మెట్రో సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. మెట్రోరైలు కారిడార్‌-2కు సంబంధించి జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి ఇమ్లీబన్‌ వరకు

నగరవాసులకు గుడ్ న్యూస్. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మెట్రో సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. మెట్రోరైలు కారిడార్‌-2కు సంబంధించి జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి ఇమ్లీబన్‌ వరకు డిసెంబర్‌లో మెట్రోరైలు రాకపోకలు సాగించనున్నది. 15 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 9.66 కిలోమీటర్ల మార్గానికి కొంతవరకు అనుమతులు లభించాయి. భారత ప్రభుత్వ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (సీఈఐజీ) డీవీఎస్‌ రాజు ఆధ్వర్యంలో తనిఖీ బృందం బుధవారం(ఆగస్టు 21,2019) ముషీరాబాద్‌ నుంచి చిక్కడపల్లి వరకు మెట్రో మార్గాన్ని తనిఖీ చేసింది. పనులపై సంతృప్తి వ్యక్తంచేసింది.

ముషీరాబాద్-చిక్కడపల్లి మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు పెట్టేందుకు వీలుగా మూడు స్టేషన్ల దగ్గర యాక్జిలరీ విద్యుత్ సబ్ స్టేషన్స్ ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. సబ్ స్టేషన్స్ ఏర్పాటుతో సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్స్, అటోమేటిక్ ఫేర్ కలెక్షన్ గేట్ల ఏర్పాటు వంటి పనులను చేపట్టడానికి లైన్ క్లియర్ అయినట్టు ఎల్ అండ్ టీ అధికారులు తెలిపారు. ఈ సబ్ స్టేషన్స్ కు ఎంజీబీఎస్, ఉప్పల్ రిసీవింగ్ సబ్ స్టేషన్ల నుంచి కరెంట్ సప్లయ్ కానుంది. ఈ పనుల పూర్తితో కారిడార్-2 పనులు కొలిక్కి వచ్చాయని ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు తెలిపారు.

హైదరాబాద్ మెట్రో రైలుకి నగరవాసుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మెట్రోలో జర్నీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే మెట్రో రైలు పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఒకే రోజు 3లక్షల మంది ప్రయాణించిన రికార్డ్ క్రియేట్ అయ్యింది. మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 9 కోట్ల మంది జర్నీ చేసినట్టు అధికారులు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు మెట్రో రైల్లో జర్నీకి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ట్రాఫిక్ నరకం ఉండదు, పొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఎండ బాధలు లేవు, ఎలాంటి రిస్క్ లేకుండా హ్యాపీగా అది కూడా ఫాస్ట్ గా గమ్య స్థానాలకు చేరుకోవచ్చు. దీంతో మెట్రో రైలులో ప్రయాణానికి అంతా ఆసక్తి చూపిస్తున్నారు.