సవాల్ స్వీకరించే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి లేదు: మంద కృష్ణమాదిగ

హరీశ్ రావు సవాల్ స్వీకరించారు కాబట్టి తాను చెప్పిన టైమ్‌కు గ‌న్‌పార్క్‌కు వచ్చారని.. సవాల్ స్వీకరించే దమ్ము రేవంత్ రెడ్డికి లేదని మంద కృష్ణమాదిగ విమర్శించారు.

సవాల్ స్వీకరించే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి లేదు: మంద కృష్ణమాదిగ

Manda Krishna Madiga: సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టేసి రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. వరంగల్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే దేవుళ్ల మీద కాదు.. తన కుటుంబ సభ్యుల మీద ఒట్టేసి హామీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హరీశ్ రావు సవాల్ స్వీకరించారు కాబట్టి తాను చెప్పిన టైమ్‌కు గ‌న్‌పార్క్‌కు వచ్చారని.. సవాల్ స్వీకరించే దమ్ము రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టే సీఎం రేవంత్ రాలేదన్నారు. ఆయన ఇంచార్జిగా ఉన్న రాష్ట్రాలకు తెలంగాణ నిధులు మళ్లించి ఖర్చు పెడుతున్నారని.. కాబట్టే ఇక్కడ హామీలు అమలు చేయలేక పోతున్నారని ఆరోపించారు.

రేవంత్ రెడ్డిపై ప్రజాభిమానం లేదని.. అందుకే కామారెడ్డిలో ఓడిపోయారని మంద కృష్ణమాదిగ అన్నారు. ”ఆయనకు ప్రజాభిమానం లేదు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ తుడిచి పెట్టుకు పోయింది. ఒక పార్టీలో గెలిచి రాజీనామా చేయకుండా.. మరో పార్టీలోకి మారే నేతలను రాళ్లతో కొట్టాలని రేవంత్ గతంలో అన్నారు. కడియం శ్రీహరిని పార్టీలోకి తీసుకున్న మిమ్మల్ని ప్రజలు ఏం చేయాలి? మీకు విలువలు ఉంటే కడియం శ్రీహరితో రాజీనామా చేయించాలి.

Also Read: రాజీనామా లేఖతో గన్‌పార్కుకు వచ్చిన హరీశ్ రావు

కడియం SC కాదని గతంలో మీరే చెప్పారు. బైండ్ల కులానికి చెందిన SC సర్టిఫికెట్‌తో ఆయన చెలామణి అవుతున్నారు. ఆయన కులమెంటో తేల్చడానికి కమిటీ వేయాలి. కడియం శ్రీహరి SC కానప్పుడు.. ఆయన కూతురు ఎలా SC అవుతుంది? రేవంత్ రెడ్డి వల్ల మాదిగలు తీవ్రంగా నష్ట పోయారు. మాదిగ – మాలల నుంచి ఎదురుదాడి తప్పద”ని అన్నారు.

Also Read: బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ, కారు ఇక తూకానికే- సీఎం రేవంత్ రెడ్డి