దొరికాడు : సీఎం కేసీఆర్ కు పార్శిల్స్ పంపిన వ్యక్తి అరెస్ట్

గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ కవిత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు సినీ ప్రముఖుల అడ్రస్ లతో పార్శిల్స్ పంపిన వ్యవహారం కలకలం రేపిన

  • Published By: veegamteam ,Published On : August 22, 2019 / 05:42 AM IST
దొరికాడు : సీఎం కేసీఆర్ కు పార్శిల్స్ పంపిన వ్యక్తి అరెస్ట్

గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ కవిత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు సినీ ప్రముఖుల అడ్రస్ లతో పార్శిల్స్ పంపిన వ్యవహారం కలకలం రేపిన

గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ కవిత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల అడ్రస్ లతో పార్శిల్స్ పంపిన వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు పార్శిల్స్ పంపిన వ్యక్తిని గుర్తించారు. అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు సికింద్రాబాద్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడి తల్లిదండ్రులను పోలీసులు విచారిస్తున్నారు.

ఆగస్టు 17న సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు, వీఐపీల చిరునామాలకు గుర్తు తెలియని వ్యక్తి 62 కాటన్ బాక్స్ లను పంపాడు. ఈ బాక్సుల్లో బాటిల్స్ ఉన్నాయి. అందులో లిక్విడ్ ఉంది. ఇవన్నీ సికింద్రాబాద్ హెడ్ పోస్టాఫీస్ కి వచ్చాయి. ఈ పార్శిల్స్ నుండి దుర్వాసన రావడాన్ని సిబ్బంది గమనించారు. అసలే వీఐపీల అడ్రస్ లు ఉన్నాయి. వారికి పంపాల్సిన పార్శిల్స్ నుంచి దుర్వాసన రావడంతో సిబ్బంది భయపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పార్శిల్స్ ఓపెన్ చేయగా అందులో బాటిల్స్ కనిపించాయి. వాటిలో కలర్ లిక్విడ్ ఉంది. దీంతో అవి కెమికల్ బాంబులేమో అని పోస్టాఫీస్ సిబ్బంది, పోలీసులు టెన్షన్ పడ్డారు. ఈ బాటిల్స్ నుండి నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపారు. అక్కడ టెస్టులు చేయగా.. బాటిల్స్ లో ఉన్నది కెమికల్ కాదు మురుగు నీరు అని తేలింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఈ పార్శిల్స్ ఓయూలోని పోస్టాఫీస్ నుంచి వచ్చాయి. ఓయూ పరిసర ప్రాంతాల్లో తాగునీరు కలుషితం అయ్యిందని.. ప్రజలు మురుగు, కలుషిత నీటినే తాగుతున్నారనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఇలా చేశారని పోలీసులు గుర్తించారు. బాటిల్స్ తో పాటు పోలీసులు ఓ లేఖని కూడా గుర్తించారు. ఈ మురుగు నీటినే మేము తాగుతున్నాము అని అందులో ఉంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.