యశస్వి క్రేజ్ మాములుగా లేదుగా.. గుండెలపై పచ్చబొట్టు పొడిపించుకున్న అభిమాని

యశస్వి క్రేజ్ మాములుగా లేదుగా.. గుండెలపై పచ్చబొట్టు పొడిపించుకున్న అభిమాని
ad

అభిమానిస్తే ఎటువంటి పనికైనా సిద్ధపడడం చూస్తూనే ఉంటాం.. ప్రోగ్రాముల్లో కూడా ఫేమ్.. నేమ్ వస్తే చాలు వాళ్లకు అభిమానులు అవ్వడం చూస్తూనే ఉన్నాం.. ఇప్పటివరకు ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అంటూ స్టార్ హీరోల అభిమానులు వారిని అభిమానిస్తూ.. ఫోటోలను పచ్చబొట్లుగా వేయించుకోవడం చూశాం కదా? ఓ సింగర్ అభిమాని అందులోనూ అప్‌కమింగ్ టాలెంట్‌కు అభిమానిగా మారిన యువకుడు గుండెలపై సింగర్ ఫోటోను పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు..

ఓ ప్రముఖ ఛానల్‌లో వస్తున్న SA RE GA MA PA The Next Singing ICON సింగింగ్ షోలో తన గాత్రంలో సింగర్‌గా సెన్సేషనల్ అయ్యారు యశస్వి. తెలుగు రాష్ట్రాల్లో యశస్వి కొండెపూడికి ఫాలోయింగ్ పెరిగిపోగా.. లైఫ్ ఆఫ్ రామ్ పాటను పాడి ఒరిజినల్ సింగర్ కంటే ఎక్కువగా ఫేమస్ అయిన యశస్విపై తన ప్రేమను షోలోనే బయటపెట్టాడు అభిమాని.

యశస్వీ కొండెపూడి అదే షోలో ప్రియా ప్రియా చంపొద్దే అనే పాటను పాడగా.. ఆ పాట అయిపోయిన తర్వాత ఓ అభిమానిని షోలోకి తీసుకొచ్చారు. యశస్వీ అభిమాని అంటూ షోలో అందరికీ పరిచయం చేసుకోగా.. అభిమాని చర్యకు అందరూ షాక్ అయ్యారు. పచ్చబొట్టు వేయించుకోగా.. అది చూసి యశస్వి ఎమోషనల్ అయ్యాడు. అభిమానిని గుండెలకు హత్తుకున్నాడు.