టీడీపీకి రాజీనామా చేసిన యువ నేత

  • Published By: vamsi ,Published On : September 30, 2019 / 11:55 AM IST
టీడీపీకి రాజీనామా చేసిన యువ నేత

ఓ వైపు తెలంగాణలో పట్టు దక్కంచుకునేందుకు టీడీపీ అడుగులు వేస్తుంటే.. ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా పార్టీ వీడి వెళ్లిపోతున్నారు. లేటెస్ట్ గా.. తెలంగాణలో పార్టీకి కీలకమైన నేత యువ నాయకుడు తూళ్ల వీరేందర్ గౌడ్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దేవేందర్‌ గౌడ్‌ కుమారుడైన వీరేందర్‌ గౌట్ టీడీపీలో కీలకనేతగా ఉన్నారు. తెలగుదేశం పార్టీలో కీలక పదవులు నిర్వహించిన దేవేందర్ గౌడ్ గతకొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ఈ క్రమంలో యువనేతగా ఎదిగిన వీరేందర్ గౌడ్.. 2014లో ఉప్పల్‌ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశించారు. అయితే ఆ నియోజకవర్గం నుంచి కాకుండా చివరకు చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఎన్నికల పోటీలో నిలిచి ఓడిపోయారు. 2019లో మహాకూటమి తరఫున పోటీ చేసినా టీఆర్ఎస్ సునామీలో గెలవలేకపోయారు.

ఎన్నికల తర్వాత నుంచి రాజకీయంగా పెద్దగా యాక్టీవ్ గా లేని వీరేందర్ గౌడ్.. ఇప్పుడు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకి పంపారు. రాజకీయ అవసరాల కోసం సిద్ధాంతాలకు భిన్నంగా టీడీపీ వ్యవహరిస్తోందని లేఖలో విమర్శలు గుప్పించారు. ఉన్నత ఆదర్శాలు, సిద్ధాంతాలతో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఇప్పుడు అలా లేదని అన్నారు. ఇక వీరేందర్‌ గౌడ్‌ అక్టోబర్ 3న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం ఉంది.