Anasuya Bharadwaj : బాబోయ్ ఏంటా క్లైమాక్స్.. జీవితాంతం గుర్తుంచుకుంటా.. జీవితంలో తొలిసారి ఇలా..
టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఉప్పల్ మైదానంలో సందడి చేసింది.

Actor Anasuya Bharadwaj reaction after SRH vs RR match in Uppal stadium
Anasuya : ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ మొదట బ్యాటింగ్ చేసింది.
నితీశ్‌కుమార్ రెడ్డి (42 బంతుల్లో 76 నాటౌట్), ట్రావిస్ హెడ్ (44 బంతుల్లో 58), హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 42నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. సందీప్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (40 బంతుల్లో 67), రియాన్ పరాగ్ (49 బంతుల్లో 77) రాణించారు. హైదరాబాద్ బౌలర్లో భువనేశ్వర్‌కుమార్ మూడు వికెట్లు తీశాడు. కాగా.. టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఉప్పల్ మైదానంలో సందడి చేసింది. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఈ మ్యాచ్‌కు హాజరైంది.
Prasanna Vadanam : ‘ప్రసన్న వదనం’ మూవీ రివ్యూ.. సుహాస్ మళ్ళీ హిట్ కొట్టాడా..?
సన్‌రైజర్స్ హైదరాబాద్ కు మద్దతు తెలిపింది. సన్‌రైజర్స్ జెండా పట్టుకుని ఊపుతూ ఆటగాళ్లను ఉత్సాహపరిచింది. హైదరాబాద్ బ్యాటర్లు భారీ షాట్లు కొట్టినప్పుడు, బౌలర్లు వికెట్లు తీసినప్పుడు ఎగిరి గంతులేసింది. కాగా.. తాను స్టేడియంలో మ్యాచ్ చూడడం ఇదే మొదటి సారి అని అనసూయ చెప్పింది. ఈ మ్యాచ్‌ను జీవితాంతం గుర్తుకు ఉంచుకుంటానంది.
‘స్టేడియంలో మ్యాచ్ చూడడం ఇదే తొలిసారి. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్‌ను జీవితాంతం గుర్తుంచుకునేలా చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇలాగే దూసుకువెళ్లాలి. యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, టీమ్ రాజస్థాన్ రాయల్స్ చాలా చక్కగా ఆడారు. ఏంటా క్లైమాక్స్!!! గ్రేట్ గ్రేట్ మ్యాచ్.’ అంటూ అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.
తాను స్టేడియంలో దిగిన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.
View this post on Instagram