చదివింది టెన్త్ క్లాసే : ఆల్కహాల్‌ డిటెక్టర్‌‌తో అద్భుతం చేశాడు

హైదరాబాద్: కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్నారు పెద్దలు. ఏదైనా కొత్తగా ఆవిష్కరించాలనే తపన ఉంటే చాలు.. దానికి పెద్దపెద్ద డిగ్రీలు అవసరం లేదని

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 01:27 PM IST
చదివింది టెన్త్ క్లాసే : ఆల్కహాల్‌ డిటెక్టర్‌‌తో అద్భుతం చేశాడు

హైదరాబాద్: కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్నారు పెద్దలు. ఏదైనా కొత్తగా ఆవిష్కరించాలనే తపన ఉంటే చాలు.. దానికి పెద్దపెద్ద డిగ్రీలు అవసరం లేదని

హైదరాబాద్: కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్నారు పెద్దలు. ఏదైనా కొత్తగా ఆవిష్కరించాలనే తపన ఉంటే చాలు.. దానికి పెద్దపెద్ద డిగ్రీలు అవసరం లేదని నిరూపిస్తున్నాడు హైదరాబాదీ కుర్రాడు. చదివింది టెన్త్‌ క్లాసే అయినా.. సమాజానికి ఏదైనా కొత్తగా అందించాలన్న తపన… అతడిని ఒక సిస్టంను తయారు చేసేలా చేసింది. ఇంతకీ ఎవరా యువకుడు. ఏంటా సిస్టం.

 

సాయితేజ. పక్కా హైదరాబాదీ. చదివింది టెన్త్‌ క్లాసే. సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న తపన అతడిని ఒక సిస్టం కనిపెట్టేలా చేసింది. 22ఏళ్ల సాయితేజ ఆల్కహాల్‌ డిటెక్టర్‌ను కనిపెట్టాడు. డ్రైవర్‌ మద్యం తాగాడా లేదా అన్నది నిర్దారించే ఆల్కహాల్‌ డిటెక్టర్‌ను ఇతను ఆవిష్కరించాడు. సాయితేజ తయారు చేసిన ఆల్కహాల్‌ డిటెక్టర్‌ డ్రైవర్ మద్యం సేవించి ఉంటే.. దానిని వెంటనే గుర్తిస్తుంది. అంతేకాదు.. ఇంజన్‌ను ఆఫ్‌ చేస్తుంది. ఇంజన్‌ను ఆపి వాహనం ముందుకు కదలకుండా చేయడమేకాదు… అందులో ఫీడ్‌ చేసిన మొబైల్‌ నంబర్లకు ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ పంపిస్తుంది.

 

సాయితేజకు ఎలక్ట్రానిక్స్‌ అంటే ఎంతో ఆసక్తి. ఇంటర్నెట్‌లో ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన కొత్త విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు. అదే ఆసక్తితో ఏదైనా కొత్తగా తయారు చేయాలనుకున్నాడు. ఇంటర్నెట్‌ను గురువుగా మార్చుకుని ఆల్కహాల్‌ డిటెక్టర్‌ అనే సరికొత్త డివైస్‌ను ఆవిష్కరించాడు. ఆల్కహాల్‌ డిటెక్టర్‌ను తయారు చేసేందుకు 2వేల 500 రూపాయలు ఖర్చుకాగా.. 15 రోజుల సమయం పట్టింది. ఆల్కాహాల్‌ డిటెక్టర్‌ను కనిపెట్టిన సాయితేజను పలువురు అభినందించారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా సాయితేజను అభినందించారు. సమాజానికి ఉపయోగపడేలా కొత్తగా ఆవిష్కరించాలన్న తపనతోనే తాను ఆల్కాహాల్‌ డిటెక్టర్‌ తయారు చేశానని సాయితేజ చెప్పాడు. కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని మరోసారి ఈ కుర్రాడు నిరూపించాడు.

Also Read : తల్లి పడరాని పాట్లు: కొడుకు కోసం కాలేజీల్లో అమ్మాయిల వేట

Also Read : తండ్రి శవానికి ఐపీఎస్ ఆఫీసర్ నెలరోజులుగా చికిత్స

Also Read : మనోళ్లకే ఫస్ట్ ప్రైజ్: మంచుతో మహావిష్ణు శిల్పం

Also Read : ఎంతో టేస్టీ: ఆయుర్వేదిక్ ఐస్ క్రీం.. రుచి చూడాల్సిందే

Also Read :  ఫిబ్ర‌వ‌రిలోనే లాంచ్‌ : ‘రెడ్ మీ నోట్ 7’ వ‌చ్చేస్తోంది