నాలుగేళ్ల జైలు శిక్ష తర్వాత శశికళకు విడుదల

నాలుగేళ్ల జైలు శిక్ష తర్వాత శశికళకు విడుదల

VK Sasikala: ఏఐఏడీఎంకే మాజీ లీడర్ వీకే శశికళను నాలుగేళ్ల జైలు శిక్ష తర్వాత జనవరి 27 బుధవారం విడుదల చేశారు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమెకు ప్రస్తుతం కరోనా సోకడంతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో 63ఏళ్ల శశికళను హాస్పిటల్ లో ఉండగానే రిలీజ్ చేస్తామని.. దానికి తగ్గ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

జనవరి 20న ఆమె రిలీజ్ కావాల్సి ఉండగా.. అప్పుడే వైరస్ పాజిటివ్ వచ్చింది. దాంతో బెంగళూరులోని బౌరింగ్ హాస్పిటల్ లో జాయిన్ చేసి తర్వాత విక్టోరియా హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. శ్వాస సంబంధిత సమస్యలు చాలా కనిపిస్తుండటంతో ర్యాపిడ్ యాంటిజెన్, ఆర్టీ పీసీఆర్ టెస్టు రిపోర్టులు చేశారు. వాటిల్లో నెగటివ్ అని తేలింది. డిశ్చార్జ్ చేసే సమయంలో మరోసారి పరీక్షించగా పాజిటివ్ వచ్చింది.

శశికళ మేనల్లుడు అమ్మ మక్కల్ మన్నేట్ర కజగం జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్ బెంగళూరులో ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తేల్చారు. డాక్టర్లు చాలా కేరింగ్ తో చూసుకుంటున్నారని చెప్పారు. సోమవారానికి డాక్టర్లను సంప్రదించి ఆమెను డిశ్చార్జ్ చేస్తామని వెుల్లడించారు.

2017లో శశికళకు రూ.66కోట్ల అక్రమాస్తులు ఉన్నాయనే కారణంతో శిక్ష విధించారు. మేనకోడలు జే ఇళవరసితో పాటు జే జయలలితా ఫాస్టర్ సన్ వీఎన్ సుధాకరన్‌లు కూడా ఈ కేసులో దోషులే.