ఇండియా ఇకపై ప్రజాస్వామిక దేశంగా ఉండదు: రాహుల్ గాంధీ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై మరోసారి నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ.. ఇండియా ప్రజాస్వామిక దేశంగా మరెంతో కాలం ఉండదని అన్నారు. 'పాకిస్తాన్ లాగా ఇండియాలో నిరంకుశత్వం కొనసాగుతుంది. బంగ్లాదేశ్ కంటే దారుణమైన పరిస్థితి కొనసాగుతుందని..

ఇండియా ఇకపై ప్రజాస్వామిక దేశంగా ఉండదు: రాహుల్ గాంధీ

rahul-gandhi--farm-laws1

India Democratic Country: భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై మరోసారి నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ.. ఇండియా ప్రజాస్వామిక దేశంగా మరెంతో కాలం ఉండదని అన్నారు. ‘పాకిస్తాన్ లాగా ఇండియాలో నిరంకుశత్వం కొనసాగుతుంది. బంగ్లాదేశ్ కంటే దారుణమైన పరిస్థితి కొనసాగుతుందని స్వీడన్ ఇన్ స్టిట్యూట్ డెమోక్రసీ రిపోర్టు’ను దానికి జత చేశారు.

కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్.. ఇందన ధరలు పెరిగిపోవడం, రైతు చట్టాలు, ఇతర అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గానూ ధరలు పెంచి ట్యాక్సులు వసూలు చేయాలనే మోడీ ప్రభుత్వం ఇలా చేస్తుందంటూ ఆరోపించారు. రైతు ఆందోళనలో మార్చి 5 వందో రోజున వయనాడ్ ఎంపీ.. కొత్త వ్యవసాయ చట్టాలను ఎట్టి పరిస్థితుల్లోనైనా వెనక్కు తీసుకోవాల్సిందేనంటూ పట్టుబట్టారు.

విత్తనాలు వేసి పంట మొదలుపెట్టాక కూడా సహనంతో ఎదురుచూస్తున్న వారు… నెలల తరబడి వాతావరణాన్ని పట్టించుకోకుండా అక్కడే ఉంటున్నారు. కచ్చితంగా మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలి’ అని ట్వీట్ చేశారు రాహుల్.