ముఖేశ్ అంబానీ ఇంట్లో కొత్త ఫెర్రారీ ఎస్ఎఫ్90

ముఖేశ్ అంబానీ ఇంట్లో కొత్త ఫెర్రారీ ఎస్ఎఫ్90

mukesh ambabni new car

Mukesh Ambani: అంబానీ ఇంట్లో ఆల్రెడీ బోలెడన్నీ లగ్జరీ వెహికల్స్ ఉన్నా.. గత నెలలో మరో కొత్త గెస్ట్ వచ్చింది. ఈ జియో గ్యారేజిలో సూపర్ స్పోర్ట్స్ కార్ అడుగుపెట్టేసింది. లేటెస్ట్ ఎడిషన్ Ferrari SF90 Stradaleను ఫొటో తీసిన ఫొటోగ్రాఫర్ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఫెర్రారీ అంటే గుర్తొచ్చే.. హిస్టారికల్ రెడ్ కలర్ లో ఉన్నకారు.. గ్యారేజిలోకి వెళ్తున్న ఫొటో ట్రెండ్ అయింది.

ఈ SF90 మోడల్ ఫెర్రారీ కార్లలోనే అడ్వాన్స్‌డ్ మోడల్. ట్విన్ టర్బో ఛార్జ్‌డ్ V12పెట్రోల్ ఇంజిన్, 4లీటర్ల V8, దాని వల్ల మ్యాగ్జిమమ్ అవుట్ పుడ్ 780పీఎస్ వరకూ వస్తుందట. ఇందులో ఉన్న మూడు ఎలక్ట్రిక్ మోటార్స్ తో 220పీఎస్ కూడా వస్తుంది. ఈ కాంబినేషన్ లో SF90 మోడల్ 1000పీఎస్ వరకూ రాబడుతుంది.

కేవలం 2.5సెకన్లలోనే గంటకు 100కిలోమీటర్ల వరకూ వేగం పెంచుకోగలదు. 6.7సెకన్లలో గంటకు 200కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 340కిలోమీటర్లు. ఈ స్పోర్ట్స్ కార్‌లో ఉన్న 4రకాల డ్రైవింగ్ మోడ్స్ లో ఉండి మనకు తగ్గట్లుగా సెట్ చేసుకోవచ్చు.

 


 

ఈడ్రైవ్ మోడ్ లో ఉంచి.. ఎలక్ట్రిక్ మోటార్స్ పై సైలెంట్ గా నడిపించొచ్చు. అప్పుడు ఎలక్ట్రిక్ పవర్ మాత్రమే పనిచేస్తుంది. హైబ్రిడ్ మోడ లో ఉంచితే.. ఎలక్ట్రిక్ తో పాటు గ్యాసోలిన్ ఇంజిన్ కూడా రెడీ అవుతుంది. కండిషన్ తగ్గట్లుగా కంప్యూటర్ ఇంజిన్ ఆఫ్ అవుతుంది. అలా చేయడం వల్ల ఫ్యూయెల్ సేవ్ అవడంతో పాటు ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. పర్‌ఫార్మెన్స్ మోడ్ ఆన్ చేస్తే ఇంజిన్ రన్నింగ్ లో ఉండి.. ఎప్పుడైనా ముందుకు వెళ్లడానికి రెడీగా ఉంటుంది. ఇక క్వాలిటీ మోడ్ లో ఉంటే.. కొత్త డ్రైవింగ్ మోడ్ తో పాటు.. హై పర్‌ఫార్మెన్స్ మోడ్ ఆన్ అయినట్లే.