WhatsApp Face Unlock : గూగుల్ పిక్సెల్ 8 సిరీస్‌‌లో కొత్త ఫేస్ అన్‌లాక్ సపోర్టు ఫీచర్.. ఇదేలా పనిచేస్తుందంటే?

వాట్సాప్ యూజర్లు ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లో ఫేషియల్ రికగ్నిషన్‌ని సెటప్ చేసిన తర్వాత యాప్‌ను అన్‌లాక్ చేసేందుకు ఫోన్ ఫ్రంట్ కెమెరాను కూడా వాడొచ్చు.

WhatsApp Face Unlock : గూగుల్ పిక్సెల్ 8 సిరీస్‌‌లో కొత్త ఫేస్ అన్‌లాక్ సపోర్టు ఫీచర్.. ఇదేలా పనిచేస్తుందంటే?

WhatsApp Now Supports Face Unlock for App Lock

WhatsApp Face Unlock : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ గత ఏడాదిలో మెరుగైన ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో యూజర్లకు బ్యాంకింగ్, పేమెంట్ యాప్‌లను యాక్సెస్ చేసేందుకు అనుమతిస్తుంది. ఇప్పుడు, వాట్సాప్ పిక్సెల్ 8 ఫోన్‌లలో ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు సపోర్టును అందించింది.

Read Also : AC Electricity Bill : ఈ వేసవిలో మీ ఏసీ మరింత కూల్‌గా.. ఇలా చేస్తే.. విద్యుత్ బిల్లుపై డబ్బు ఆదా చేసుకోవచ్చు తెలుసా?

ఈ అప్‌డేట్ వాట్సాప్ అన్‌లాక్ చేసేందుకు చాట్‌లను సీక్రెట్‌గా ఉంచేందుకు అనుమతిస్తుంది. వాట్సాప్ యూజర్లు ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లో ఫేషియల్ రికగ్నిషన్‌ని సెటప్ చేసిన తర్వాత యాప్‌ను అన్‌లాక్ చేసేందుకు ఫోన్ ఫ్రంట్ కెమెరాను కూడా వాడొచ్చు. ఈ ఫెసిలిటీతో బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా అవసరం ఉండదు.

పిక్సెల్ 8 ఫోన్లలో కొత్త సెక్యూరిటీ లేయర్ :
మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో యూజర్లపై యాప్‌కి సరికొత్త అప్‌డేట్‌తో కొత్త సెక్యూరిటీ లేయర్‌ని అందిస్తోంది. పిక్సెల్ 8 సిరీస్‌లో ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ వాట్సాప్ స్టేబుల్ వెర్షన్ 2.24.8.85తో అందుబాటులోకి వచ్చినట్లు కనిపిస్తోంది.

అప్‌డేట్ తర్వాత వాట్సాప్ స్క్రీన్ దిగువన సిస్టమ్ ఫేస్ అన్‌లాక్ షీట్‌ యాప్‌ను ఎనేబుల్ చేసిన తర్వాత ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చుట్టూ రింగ్‌ ఉంటుంది. ఈ యాప్ కొన్ని సెకన్లలో యూజర్ ఫేస్ గుర్తించకపోతే ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ప్రాంప్ట్‌కి తిరిగి మారుతుంది. యూజర్లు తమ పిన్‌ను ఎంటర్ చేయడానికి కూడా ఎంచుకోవచ్చు.

ఇకపై లాక్ అనే ఆప్షన్ చూడొచ్చు :
లేటెస్ట్ అప్‌డేట్ ‘వాట్సాప్ లాక్డ్’ స్క్రీన్‌కు వ్యూను మార్చేస్తుంది. గూగుల్ పిక్సెల్ 8లో లాక్ చేసిన స్క్రీన్ ఇప్పుడు గత టిక్ మార్క్‌కు బదులుగా లాక్ అనే పదాన్ని సూచిస్తుంది. గూగుల్ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో ఫేస్ అన్‌లాక్ ఆప్షన్ చాలా ఏళ్లుగా అందిస్తోంది.

అయితే, గత ఏడాది అక్టోబర్‌లో లాంచ్ అయిన పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు, గూగుల్ వ్యాలెట్ వంటి సపోర్టెడ్బ్యాంకింగ్, పేమెంట్ యాప్‌లను యాక్సెస్ చేయొచ్చు. అప్‌గ్రేడ్ చేసిన ఫేస్ అన్‌లాక్ సామర్థ్యాలతో వస్తుంది. ఈ ఫీచర్ గూగుల్ టెన్సర్ జీ3 ఎస్ఓసీ, టైటాన్ ఎమ్2 సెక్యూరిటీ చిప్‌తో కలిపి అధునాతన మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను అందిస్తుంది. గూగుల్ ప్లే ద్వారా టచ్ చేయకుండానే ఎన్ఎఫ్‌సీ అథెంటికేషన్ ద్వారా లావాదేవీని పూర్తి చేయొచ్చు.

Read Also : Oppo K12 Launch : భారీ బ్యాటరీతో ఒప్పో K12 ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?