Youngest Mother : 11 ఏళ్లకే బిడ్డకు జన్మినిచ్చిన బాలిక.. సరికొత్త రికార్డు

యూకేలో వింత ఘటన వెలుగు చూసింది. తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకోవాల్సిన వయసులోనే ఓ బాలిక గర్భం దాల్చింది. ఓ బిడ్డకు తల్లైంది.

Youngest Mother : 11 ఏళ్లకే బిడ్డకు జన్మినిచ్చిన బాలిక.. సరికొత్త రికార్డు

Youngest Mother

Youngest Mother : యూకేలో వింత ఘటన వెలుగు చూసింది. తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకోవాల్సిన వయసులోనే ఓ బాలిక గర్భం దాల్చింది. ఓ బిడ్డకు తల్లైంది. అవును.. 11 ఏళ్లకే గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చి ఓ బాలిక ఆశ్చర్య పరిచింది. అంతేకాదు యంగెస్ట్ మదర్‌గా రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ… డాక్టర్ల పర్యవేక్షణలో ఆరోగ్యంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే బాలిక గర్భంతో ఉన్న సంగతి ఆమె తల్లిదండ్రులకు కూడా తెలియదు. తమ కూతురు తల్లైందని తెలిసి షాక్ తిన్నారు. బాలికకు పదేళ్లు ఉన్నప్పుడే గర్భం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే 10 ఏళ్లకే బాలికకు గర్భం ఎలా వచ్చింది? తల్లిదండ్రులకు తెలియకుండా ఎలా జరిగింది? అనే విషయం అంతుచిక్కడం లేదు. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

దీనిపై స్పందించిన డాక్టర్ కారల్ కూపర్.. యూకేలో అతి పిన్నవయసులో తల్లైన వ్యక్తిగా ఆ బాలిక నిలిచిందని అన్నారు. అమ్మాయిలు 8-14 సంవత్సరాల మధ్య ఎప్పుడైనా యుక్త వయసులోకి వస్తారని, ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని చెప్పారు. పెరూ దేశానికి చెందిన ఈ అమ్మాయి 11ఏళ్లకే తల్లి కాగా చరిత్రలో యంగెస్ట్ మదర్‌ రికార్డు మాత్రం మరొకరి పేరున ఉంది. 1939లోనే పెరూకు చెందిన లినా మెడీనా అనే బాలిక 6 ఏళ్ల వయసులో శిశువుకు జన్మనిచ్చింది.

కాగా గడిచిన 30 ఏళ్లలో ఇలాంటివి 4 కేసులు నమోదైనట్టు డాక్టర్ కూపర్ వెల్లడించారు. ఇక యూకేలోనే సొంత సోదరుడు అత్యాచారం చేయడంతో ట్రెస్సా అనే అమ్మాయి 12ఏళ్ల వయసులోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటివరకు ఆమె పేరిట యంగెస్ట్ మదర్‌ రికార్డ్ ఉండగా.. ఇప్పుడు యూకే యంగెస్ట్ మదర్‌గా పెరూ బాలిక నిలిచింది.