ఫిన్లాండ్ ప్రధానిగా 16 ఏళ్ల బాలిక..

  • Published By: nagamani ,Published On : October 9, 2020 / 03:13 PM IST
ఫిన్లాండ్  ప్రధానిగా 16 ఏళ్ల బాలిక..

16-year-old Finland’s girl One-day PM!: ఫిన్లాండ్‌లో కొన్ని నెలల క్రితం సనా మిరెల్లా మారిన్ ప్రధానిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అతి పిన్న వయసులో దేశ ప్రధాని అయిన మహిళగా ఆమె సనా మారిన్ రికార్డు సృష్టించింది. తాజాగా మరో సంచలన కలిగింది ఫిన్లాండ్ లో అదే.. 16 ఏళ్ళ అవా ముర్టో అనే బాలిక ఫిన్లాండ్ కు ప్రధాని అయ్యింది.



అదేంటీ ఆల్రెడీ సనా ప్రధానిగా ఉన్నారు కదా అనే అనుమానం రావచ్చు..కానీ అవా ముర్టో ఫిన్లాండ్ కు ఒక్కరోజు ప్రధాని అవ్వటం విశేషం. ప్రధాని సనా మారిన్ స్వయంగా బుధవారం (అక్టోబర్ 7,2020) అవా ముర్టోను ప్రధాని పదవిలో కూర్చోబెట్టి తాను ఓ రోజు రెస్ట్ తీసుకున్నారామె.


వివరాల్లోకి వెళితే..ప్లాన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఫిన్లాండ్‌లో గర్ల్స్ టేకోవర్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన బాలికల్ని ప్రోత్సాహిస్తోంది. నైపుణ్యత, ఐటీ రంగంలో అవకాశాల్ని పెంచడం, మహిళలపై ఆన్‌లైన్ వేధింపుల నుంచి రక్షించడం లాంటివి కార్యక్రమాలను చేస్తోంది. దీంట్లో భాగంగానే ప్రధాని సనా మారిన్.. అవా ముర్టోకు ఒకరోజు ప్రధానిగా పనిచేసే అవకాశాన్ని కల్పించారు.


ఒక్కరోజు ప్రధాని అయని సందర్భంగా అవా ముర్టో మాట్లాడుతూ..’పాలనలో ఇబ్బందులు, ప్రధాని హోదాలో రోజంతా ఉత్కంఠగా గడిచిందనీ..పరిపాలనకు సంబంధించి కొన్ని క్లిష్టమైన విషయాలు తెలుసుకున్నానని తెలిపింది. అంతేకాదు ఛాన్సలర్, మంత్రులు, ఉన్నతాధికారులతో విడివిడిగా సమీక్షా సమావేశాలు నిర్వహించాననీ..దేశాభివృద్ది, విదేశీ వాణిజ్యంపై అధికారులకు పలు సూచనలు చేశానని తెలిపింది.


వాస్తవానికి రాజకీయ నేతలు మరింత సృజనాత్మకతతో సరికొత్తగా ఆలోచించడానికి టీనేజర్ల సలహాలు, సూచనలు పనికొస్తాయనేది నా అభిప్రాయం అని అవా తన ఆలోచనను నిర్భంగా..తెలిపింది. భవిష్యత్తులో పూర్తికాలం ప్రధాని కావాలని ఉందని దేశాభివృద్ధి కోసం ఆడపిల్లలలపై వివక్ష పోయేలా పలు చర్యలు తీసుకుని వివక్ష రూపుమాపాలని 16 ఏళ్ల బాలిక అవాముర్టో.


కాగా ఫిన్లాండ్ లో టెక్నాలజీ సంస్థలు..టాప్ బోర్డు స్థానాల్లో మహిళలు చాలా తక్కువమంది ఉన్నారు. అలా పలు కీలక పదవుల్లో పరుషులు కొనసాగుతున్నారు..ప్రతిభ ఉన్నా మహిళలు మాత్రం కీలక పదవుల్లో లేకపోవటంపై అవా విచారాన్ని వ్యక్తంచేసింది. ఈ వివక్ష పోవాలని దీని కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దానికి సంబంధించిన సూచనల్ని తాను అధికారుల దృష్టికి తీసుకెళ్లానని తెలిపింది అవా ముర్టో.