Indiana: అమెరికాలోని షాపింగ్ మాల్‌లో కాల్పుల క‌ల‌క‌లం.. ముగ్గురి మృతి

అమెరికాలో మ‌రోసారి కాల్పుల క‌ల‌క‌లం చెల‌రేగింది. ఇండియానాలోని ఓ షాపింగ్ మాల్‌లో ఓ దుండ‌గుడు కాల్పులు జ‌రిపాడు. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ముగ్గురికి తీవ్ర‌గాయాల‌య్యాయి.

Indiana: అమెరికాలోని షాపింగ్ మాల్‌లో కాల్పుల క‌ల‌క‌లం.. ముగ్గురి మృతి

Indiana: అమెరికాలో మ‌రోసారి కాల్పుల క‌ల‌క‌లం చెల‌రేగింది. ఇండియానాలోని ఓ షాపింగ్ మాల్‌లో ఓ దుండ‌గుడు కాల్పులు జ‌రిపాడు. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ముగ్గురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. వారికి ఆసుప‌త్రిలో చికిత్స అందుతోంది. గ్రీన్‌వుడ్ మేయ‌ర్ మార్క్ మైయర్స్ ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. కాల్పుల ఘ‌ట‌న గురించి స‌మాచారం అందుకున్న భద్ర‌తా బ‌ల‌గాలు వెంట‌నే షాపింగ్ మాల్‌కు చేరుకుని దుండ‌గుడిని మ‌ట్టుబెట్టాయ‌ని ఆయ‌న చెప్పారు.

England vs India: మూడో వ‌న్డేలో ర‌వీంద్ర జ‌డేజా ప‌ట్టిన క్యాచ్ వీడియో వైర‌ల్
షాపింగ్ మాల్‌లో కాల్పుల‌ ఘ‌ట‌న‌ను చూసిన వారు త‌మ‌ను సంప్ర‌దించి వివ‌రాలు తెల‌పాల‌ని గ్రీన్‌వుడ్ పోలీసులు త‌మ‌ ఫేస్‌బుక్ పేజీలో ఓ పోస్ట్ చేశారు. అమెరికాలో కాల్పుల ఘ‌ట‌న‌లు ప‌దే ప‌దే చోటు చేసుకుంటున్నాయి. గ‌న్ వ‌యొలెన్స్ ఆర్కివ్ నివేదిక ప్ర‌కారం… ఇటువంటి ఘ‌ట‌న‌ల వ‌ల్ల ఏడాదికి 40 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నెల 4న కూడా షికాగోలో ఓ దుండ‌గులు కాల్పులు జ‌ర‌ప‌డంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 35 మంది గాయాల‌పాల‌య్యారు.