Gun Shooting in Mexico : డ్రగ్స్ వ్యాపారం చేసే ఇంట్లో కాల్పులు..ముగ్గురు మహిళలు సహా 9మంది మృతి
మెక్సికోలో మాదకద్రవ్యాల వ్యాపారం చేసే ఓ ఇంట్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా తొమ్మిదిమంది మృతి చెందారు.

Gun Shooting In Mexico
Gun Shooting in Mexico: మాదకద్రవ్యాల వ్యాపారం చేసే ఓ ఇంట్లో (Drug House )జరిగిన కాల్పుల్లో ముగ్గురు మహిళలతో సహా తొమ్మిది మంది మృతి చెందారని మెక్సికో అధికారులు వెల్లడించారు. బుధవారం (మార్చి,2022) సెంట్రల్ మెక్సికోలోని అట్లిక్స్కో పట్టణంలో జరిగిన ఈ ఘటనలో తొమ్మిదిమంది మరణించారని అధికారులు ధృవీకరించారు.
మెక్సికో నగరానికి తూర్పున ఉన్న ప్యూబ్లా రాష్ట్రంలో బుధవారం బుధవారం (మార్చి,2022) తెల్లవారుజామున దాడి జరిగిందని అధికారులు చెప్పారు. మృతులు తమ రాష్ట్రానికి చెందినవారు కాదని ప్యూబ్లా అటార్నీ జనరల్ కార్యాలయం అధికారి బార్బోసా తెలిపారు.
దాడి జరిగిన ప్రదేశం డ్రగ్స్ వ్యాపారం చేసే స్థలమని ప్యూబ్లా గవర్నర్ మిగ్యుల్ బార్బోసా తెలిపారు. రెండు ముఠాల మధ్య కాల్పులు జరిగినట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పైప్‌లైన్‌ల నుంచి ఇంధనాన్ని దొంగిలించే ముఠాలకు ప్యూబ్లా చాలా కాలంగా నిలయంగా మారింది.