Afghans fall from Sky: విమానం టైర్లకు వేలాడుతూ కిందపడ్డ అఫ్ఘాన్లు

ఏ విమానమైనా సరే ఎక్కేసి దేశం వదలాలనేదే టార్గెట్. అలా కుదరని వారు టైర్ల‌ను గ‌ట్టిగా ప‌ట్టుకొని బ‌య‌ట‌ప‌డ‌టానికి ప్ర‌య‌త్నించి ఆకాశం నుంచి కిందపడిపోయారు

Afghans fall from Sky: విమానం టైర్లకు వేలాడుతూ కిందపడ్డ అఫ్ఘాన్లు

Afghanistan Fall From Plane

Afghans fall from Sky: ఆఫ్ఘ‌నిస్థాన్‌‌లో దారుణ‌మైన ప‌రిస్థితుల నుంచి బయటపడేందుకు ఆ దేశస్థులు ఎంతటి ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతున్నారు. దేశం నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని చూస్తూ ఎయిర్‌పోర్ట్‌లోకి దూసుకొస్తున్నారు. ఏ విమానమైనా సరే ఎక్కేసి దేశం వదలాలనేదే టార్గెట్. అలా కుదరని వారు టైర్ల‌ను గ‌ట్టిగా ప‌ట్టుకొని బ‌య‌ట‌ప‌డ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. అలా విమానం గాల్లోకి ఎగిరిన కాసేప‌టికే.. అలా ముగ్గురు కింద ప‌డిపోయారు. దగ్గర్లోని ఇళ్లపై పడినప్పుడు పెద్ద శబ్దం వినపడటంతో గమనించామని స్థానికులు చెబుతున్నారు.

కాబుల్‌ ఎయిర్‌పోర్ట్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. బతికితే చాలని అనుకుని పొరుగుదేశాలకు పయనమవుతున్నారు. కొందరు కట్టుబట్టలతో బయల్దేరిపోయి ఎయిర్ పోర్టులో పడిగాపులు కాస్తున్నారు. జనాలు భారీగా రావడంతో రన్‌వే కూడా అప్ఘన్లతో నిండిపోయింది. దేశం నుంచి వెళ్లాలంటే..ఉన్న ఏకైక మార్గం కాబుల్‌ ఎయిర్‌పోర్ట్‌ మాత్రమే. అక్కడికి చేరుకున్న వారిని కంట్రోల్ చేయడం ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందికి కష్టంగా మారింది.

ఇటు విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ చిక్కుకుపోయి విమానాల కోసం ఎదురు చూస్తున్నారు. తమ దేశస్తుల్ని తరలించడానికి ప్రత్యేక విమానాలు నడుపుతున్నాయి బ్రిటన్‌, అమెరికా దేశాలు. బ్రిటన్‌ సైనికులు తమ దేశస్తుల్ని తరలిస్తున్నారు. అమెరికా సైనికులు కూడా తమ దేశస్తుల్ని క్షేమంగా అప్ఘన్‌ దాటిస్తున్నారు. ఎయిర్‌ ఇండియా కూడా ప్రత్యేక విమానాలను నడుపుతోంది.

Afghan Aeroplane

Afghan Aeroplane

తాలిబన్లు అప్ఘానిస్తాన్ మొత్తాన్ని గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ఊహించినదానికంటే వేగంగా కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు తాలిబన్లు. తాలిబన్ జెండాను ఎగురవేశారు. ఒక్కో ప్రావిన్స్‌ను ఆక్రమించుకుంటూ తాలిబన్లు ముందుకు దూసుకొచ్చారు. చేసేది ఏమి లేక అఫ్ఘానిస్తాన్‌ ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయింది. అధ్యక్ష పదవికి ఘనీ రాజీనామా చేశారు. మాజీ రక్షణ మంత్రి అలీ అహ్మద్ జలాలీని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు తాలిబన్లు.

ప‌ది రోజులుగా దేశంలోని ప్రధాన న‌గ‌రాల‌ను ఆక్రమిస్తూ తాలిబన్లు కాబూల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం చేతులెత్తేసింది.