Amazon Employees: అమెజాన్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. 18వేల మంది ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం

రిటైల్ దిగ్గజం అమెజాన్ సంస్థలో 18వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించినట్లు సంస్థ సీఈవో ఆండీ జాస్సీ ఉద్యోగులతో పంచుకున్న సందేశంలో స్పష్టం చేశారు. గతేడాది నవంబర్ నెలలో పదివేల మంది ఉద్యోగులను తొలగించడం జరిగిందని, జనవరి నెలలో 18వేల మందిని తొలగించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.

Amazon Employees: అమెజాన్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. 18వేల మంది ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం

Amazon

Amazon Employees: కరోనా సృష్టించిన విధ్వంసం తరువాత లక్షలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. వరుసగా పలు రంగాల్లోని దిగ్గజ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగుల సంఖ్యను కుదించుకుంటూ వస్తున్నాయి. ట్విటర్, మెటా, అమెజాన్‌తోపాటు పలు బడా సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా పలు విభాగాల్లో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా రిటైల్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగులకు షాకిచ్చింది. ఇప్పటికే పదివేల మంది ఉద్యోగులను తొలగించిన ఆ సంస్థ.. ఈ నెల చివరి నాటికి మరో 18వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది.

Amazon food delivery: భారత్‌లో ఫుడ్ డెలివరీ సేవలను నిలిపివేయనున్న అమెజాన్.. ఎందుకంటే?

రిటైల్ దిగ్గజం అమెజాన్ సంస్థలో 18వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించినట్లు సంస్థ సీఈవో ఆండీ జాస్సీ ఉద్యోగులతో పంచుకున్న సందేశంలో స్పష్టం చేశారు. గతేడాది నవంబర్ నెలలో పదివేల మంది ఉద్యోగులను తొలగించడం జరిగిందని, జనవరి నెలలో 18వేల మందిని తొలగించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. కఠిన నిర్ణయమే అని తెలిసినా తప్పని పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని సీఈవో ఆండీ జాస్సీ పేర్కొన్నాడు.

Amazon Smartphone Discounts : అమెజాన్‌లో అప్‌గ్రేడ్ డేస్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. డోంట్ మిస్..!

ఉద్యోగుల తొలగింపు ప్రభావం ఎక్కువగా యూరప్‌లో ఉంటాయని, జనవరి 18 నుంచి తొలగింపునకు గురైన వారి జాబితాను తెలియజేయడం జరుగుతుందని అన్నారు. అయితే, సహచర ఉద్యోగి ఒకరు ఈ సమాచారాన్ని ముందుగానే లీక్ చేయడం వల్ల అకస్మాత్తుగా ఉద్యోగులతో ఈ సందేశాన్ని పంచుకోవాల్సి వచ్చిందని జాస్సీ చెప్పారు. ఇదిలాఉంటే ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్‌లో సెప్టెంబర్ చివరి నాటికి 1.54 మిలియన్ల మంది ఉద్యోగులు ఉన్నారు.