Amazon: అమెజాన్ ప్రైమ్ డెలివరీ ఇక లేనట్లే..

అమెజాన్ డెలివరీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రెండు గంటల్లో డెలివరీ ఇచ్చే ప్రైమ్ సర్వీసును మూసేయనున్నట్లు ప్రకటించింది. ఇండియా, జపాన్, సింగపూర్ లో

Amazon: అమెజాన్ ప్రైమ్ డెలివరీ ఇక లేనట్లే..

Amazon Prime

Amazon: అమెజాన్ డెలివరీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రెండు గంటల్లో డెలివరీ ఇచ్చే ప్రైమ్ సర్వీసును మూసేయనున్నట్లు ప్రకటించింది. ఇండియా, జపాన్, సింగపూర్ లో ఇప్పటికే ప్రైమ్ సర్వీసును వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రైమ్ సర్వీసును తొలగించి వెబ్ సైట్ లేదా మెయిన్ యాప్ తో మాత్రమే డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.

అమెరికాలో అమెజాన్ ఫ్రెష్ నుంచి రెండు గంటల్లో డెలివరీ చేస్తున్నాం. 2019 నుంచి అనని ఫుడ్స్ మార్కెట్ లో దొరుకుతున్నాయి. ఇక ఏడాది చివర్లో థర్డ్ పార్టీ పార్టనర్స్, లోకల్ స్టోర్స్ కు వెళ్లాలనుకుంటున్నాం’ అని అమెజాన్ గ్రోసరీ వైస్ ప్రెసిడెంట్ స్టీఫెనీ లాండ్రీ అన్నారు.

అయితే అమెజాన్.. ప్రైమ్ నౌ సర్వీసును 2014లో లాంచ్ చేసింది. ఇప్పుడు ఒకే యాప్ తో షాపింగ్, ట్రాకింగ్ ఆర్డర్స్, కస్టమర్స్ ను కాంటాక్ట్ చేయడం అన్నీ సాధ్యపడుతున్నాయి. ఈ సర్వీసుపై పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉన్నప్పటికీ ఆల్ట్రా ఫాస్ట్ డెలివరీ ఆప్షన్ కోసం చూస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వెల్లడించింది.