వరల్డ్‌లోనే సంపన్న సిటీ న్యూయార్క్.. ఇండియాలో ఏ నగరమో తెలుసా?

వరల్డ్‌లోనే రిచెస్ట్ సిటీల టాప్ 50లో 11 అమెరికా నగరాలు ఉండడం గమనార్హం. ఇండియా నుంచి ఒక్క సిటీ మాత్రమే టాప్ 50లో చోటు దక్కించుకుంది.

వరల్డ్‌లోనే సంపన్న సిటీ న్యూయార్క్.. ఇండియాలో ఏ నగరమో తెలుసా?

New York City (Photo: Wikipedia)

World richest cities: టెక్నాలజీలోనే కాదు సంపదలోనూ తన ఆధిపత్యాన్ని అగ్రరాజ్యం అమెరికా కంటిన్యు చేస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక సంపన్నులున్న నగరాల్లో యూఎస్ టాప్‌లో నిలిచింది. వరల్డ్ లోనే సంపన్న సిటీగా న్యూయార్క్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఒక్క న్యూయార్క్ నగరంలోనే 349,500 మంది మిలియనీర్లు ఉన్నారని మ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ అయిన హెన్లీ & పార్ట్‌నర్స్ సంస్థ వెల్లడించింది. వీరి సంపద 3 ట్రిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువగా ఉందని, చాలా G20 దేశాల సంపద కంటే ఇది ఎక్కువని తెలిపింది. గడచిన పదేళ్లలో న్యూయార్క్ సంపద 48% పెరిగింది.

ఇండియా నుంచి ఢిల్లీ, ముంబై
రిచెస్ట్ సిటీల టాప్ 50లో 11 అమెరికా నగరాలు ఉండడం గమనార్హం. ఇండియా నుంచి ఢిల్లీ మాత్రమే టాప్ 50లో ఉంది. బే ఏరియా(2), టోక్యో(3), సింగపూర్(4), లండన్(5) నగరాలు టాప్ 5లో ఉన్నాయి. లండన్ నగరంలో సంపన్నుల సంఖ్యలో 10 శాతం తగ్గుదల నమోదయింది. ఇండియాలో అత్యధిక సంపన్నులున్న నగరాలుగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు నిలిచాయి. గత పదేళ్లలో ఢిల్లీలో 95 శాతం, ముంబై 82 శాతం గ్రోత్ నమోదయింది. బెంగళూరులోనూ సంపన్నుల సంఖ్య రెండింతలు పెరిగింది. అన్నికంటే ఎక్కువగా చైనా నగరం షెన్‌జెన్ 140 శాతం వృద్ది నమోదు చేసింది.

ఆసియా పసిఫిక్ హవా
సంపద వృద్దిలో ఆసియా పసిఫిక్ ప్రాంతం దూసుకుపోతోంది. టాప్ 10 సంపన్న నగరాల్లో ఐదు ఈ ప్రాంతంలోనే ఉండడం విశేషం. ముఖ్యంగా సింగపూర్ 2 స్థానాలు ఎగబాకి.. ఆసియాలోని అత్యంత సంపన్న సిటీగా నిలిచిన టోక్యోకు చేరువలోకి వచ్చింది. బిజినెస్ ఫ్రెండ్లీ వాతావరణం కారణంగా ఇక్కడకు సంపన్నులు ఎక్కువగా వస్తున్నారు. చైనా రాజధాని బీజింగ్ 10వ ర్యాంక్ లో నిలిచింది. మిడిల్ ఈస్ట్‌లో అత్యంత ధనిక నగరంగా నిలిచిన దుబాయ్.. ప్రపంచవ్యాప్తంగా 21వ స్థానంలో ఉంది.

Also Read: ఇన్‌స్టా పోస్ట్ ఎంతపని చేసింది.. లొకేషన్ తెలుసుకుని యువతి దారుణ హత్య

చైనా బూమ్
సంపన్న నగరాల వృద్దిలో చైనా వేగంగా దూసుకెళ్తోంది. హాంకాంగ్, తైపీతో పాటు చైనా ప్రధాన భూభాగంలోని ఐదు నగరాలు టాప్ 50లో ఉన్నాయి. గత పదేళ్లలో బీజింగ్‌లో మిలియనీర్ల సంఖ్య 90% పెరగడంతో మొదటిసారిగా టాప్ 10లోకి ప్రవేశించింది. షెన్‌జెన్ (140%), హాంగ్‌జౌ (125%), గ్వాంగ్‌జౌ (110%) నగరాలు కూడా బీజింగ్ తో పాటు వేగంగా వృద్ది చెందుతున్నాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 7 సంపన్న నగరాల్లో.. ఐదు చైనాలో, రెండు భారతదేశంలో ఉన్నాయి.

Also Read: ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థుల మధ్య గొడవ.. ఆపాలని మధ్యలోకి వెళ్లిన మరో విద్యార్థిని పొడిచి చంపి..

తలసరి సంపద ఆధారంగా చూసుకుంటే మొనాకో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఉంది. మొనాకో నగరవాసుల్లో 40% కంటే ఎక్కువ మంది మిలియనీర్లు ఉన్నారు. న్యూయార్క్ నగరం రెండో స్థానంలో నిలిచింది.