ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థుల మధ్య గొడవ.. ఆపాలని మధ్యలోకి వెళ్లిన మరో విద్యార్థిని పొడిచి చంపి..

Crime: మెల్‌బోర్న్‌లో చదువుకుంటూ ఇంటి అద్దెకు సంబంధించిన వివాదంలో విద్యార్థులు ఘర్షణకు దిగారని..

ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థుల మధ్య గొడవ.. ఆపాలని మధ్యలోకి వెళ్లిన మరో విద్యార్థిని పొడిచి చంపి..

accused

ఆస్ట్రేలియాలో చదువుకునేందుకు వెళ్లిన కొందరు భారతీయ విద్యార్థుల మధ్య గొడవ చెలరేగింది. గొడవ పడొద్దంటూ ఆపేందుకు వారి మధ్యలోకి వెళ్లాడు మరో భారతీయ విద్యార్థి. దీంతో అతడిని కత్తితో పొడించారు మన విద్యార్థులు. మెల్‌బోర్న్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎంటెక్ చదువుతున్న తన మేనల్లుడు నవజీత్ సాంధు (22)ను తోటి విద్యార్థులే బలి తీసుకున్నారని అతడి మామ యశ్వీర్ తెలిపారు. ఈ ఘర్షణలో మరో విద్యార్థికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. మెల్‌బోర్న్‌లో చదువుకుంటూ ఇంటి అద్దెకు సంబంధించిన వివాదంలో విద్యార్థులు ఘర్షణకు దిగారని ఆయన తెలిపారు.

నవజీత్ తన స్నేహితుడితో కారులో ఓ అపార్ట్‌మెంట్ కు వెళ్లాడు. సామగ్రిని ఇంట్లో పెట్టడానికి నవజీత్ ను అతడు తన వెంట తీసుకెళ్లాడు. నవజీత్ స్నేహితుడు లోపలికి వెళ్లినప్పుడు అరుపులు వినపడ్డాయి. నవజీత్ లోపలికి వెళ్లేసరికి అక్కడ కొందరు విద్యార్థులు గొడవ పడుతూ కనపడ్డారు. గొడవ పడవద్దని అతడు అనడంతో అతడి ఛాతీపై కత్తితో దారుణంగా పొడిచారు. నవజీత్ హరియాణాలోని కర్నాల్‌ ప్రాంతానికి చెందని విద్యార్థి. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కొడుకుని మొసళ్లు ఉండే నదిలో తోసేసిన తల్లి