Snakes : వీడి దుంపతెగ.. ప్యాంటులో పాములేసుకుండు.. తరువాత ఏం జరిగిందంటే?
పాములను ప్యాంటులో దాచుకొని ఎవరూ గుర్తించకుండా సరిహద్దులు దాటించాలనుకున్నాడు ఓ వ్యక్తి. కానీ, ఎయిర్ పోర్టు సిబ్బంది తనిఖీ చేసే సమయంలో సదరు వ్యక్తి ప్యాంటులో ఉన్న పాములను గుర్తించారు.

Passenger Snakes In Pants
Passenger Hiding Snakes In Pants : పాములను ప్యాంటులో దాచుకొని ఎవరూ గుర్తించకుండా సరిహద్దులు దాటించాలనుకున్నాడు ఓ వ్యక్తి. కానీ, ఎయిర్ పోర్టు సిబ్బంది తనిఖీ చేసే సమయంలో సదరు వ్యక్తి ప్యాంటులో ఉన్న పాములను గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని పరిశీలించగా.. రెండు చిన్నపాటి పాములను గుర్తించారు. ఈ ఘటన గత నెల 26న అమెరికాలోని మయామీ ఎయిర్ పోర్టు లో చోటు చేసుకుంది.
Also Read : ఎన్నికల వేళ.. మహిళ అపహరణ కేసులో ఎమ్మెల్యే అరెస్ట్
ప్రయాణికుడు ఓ సంచిలో రెండు తెల్లటి పాములను ఉంచి.. ఆ సంచిని ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. వాటిని ఎవరూ గుర్తించకుండా తరలించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అమెరికాలోని మయామీ ఎయిర్ పోర్టుకు వచ్చాడు. ఎయిర్ పోర్టు సిబ్బంది సదరు వ్యక్తిని తనిఖీ చేస్తున్న సమయంలో జేబులో ఏదో కదలాడుతున్నట్లు గుర్తించారు. అతన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. ప్యాంటు జేబులోని కళ్లద్దాలు దాచుకునే సంచిలా ఉన్న వస్తువును గుర్తించారు. దానిని స్వాధీనం చేసుకున్న ఎయిర్ పోర్టు సిబ్బంది.. అందులో ఏముందోనని తనిఖీ చేసేందుకు సంచిని విప్పగా.. అందులో రెండు తెల్ల పాములు ఉన్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని అనంతరం.. రెండు పాములను ఫోరిడా మత్స్య, ఫ్ర్పాణి సంరక్షణ కమిషన్ కు అప్పగించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ఘటన వివరాలను ట్రాన్స్ ఫోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్ఏ) ఎక్స్ (ట్విటర్) లో పోస్టు చేసింది.
Also Read : Terrorists Attack : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఐదుగురు జవాన్లకు గాయాలు
https://twitter.com/TSA_Gulf/status/1785351135512887434?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1785351135512887434%7Ctwgr%5E58e4dc932eb18a1fe939bc246766c66b8211787a%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Finternational%2Fpassenger-hiding-snakes-in-pants-intercepted-at-miami-airport-1573664