Cats ate Deadbody: వృద్ధురాలి మృతదేహాన్ని తినేసిన పెంపుడు పిల్లులు

Cats ate Deadbody: వృద్ధురాలి మృతదేహాన్ని తినేసిన పెంపుడు పిల్లులు

Pet Cats

Cats ate Deadbody: పెంపుడు పిల్లులే ఆమె మృతదేహాన్ని భక్షించాయి. క్లారా ఇన్స్ అనే 79ఏళ్ల మహిళ 1996నుంచి ఒంటరిగా అపార్ట్‌మెంట్లో ఉంటుండగా ఈ ఘటన జరిగింది. పక్కింటివాళ్లు నెలరోజులుగా వృద్ధురాలు కనిపించడం లేదని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు వచ్చి చూశారు. వృద్ధురాలు కనిపించడం లేదు కానీ వాసన వస్తుందని చెప్పడంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూశారు.

పిల్లులు సగం తినేసిన కుళ్లిపోయి ఉన్న శవాన్ని చూశారు. ఆ ఘటన చూసిన పోలీస్ తన సర్వీసులో ఇంత దారుణమైనది ఇప్పటివరకూ చూడలేదని అంటున్నారు. ఆమె చనిపోయి కనీసం మూడు నెలలైనా అయి ఉండొచ్చు. కొవిడ్ సమస్యతో చనిపోయిందా మరే ఇతర కారణమా అని తెలుసుకోవడానికి మెడికల్ టెస్టులకు పంపించాం.

ఆమె పెంపుడు పిల్లుల్లో ఐదు ఆకలితోనే చనిపోయాయి. రెండు మాత్రం బతికే ఉన్నాయి కానీ వాటి పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. స్థానిక యానిమల్ ప్రొటెక్షన్ సెంటర్ కు వాటిని చికిత్స కోసం పంపాం అని స్థానిక మునిసిపల్ అధికారి అన్నారు.

ఆ అపార్ట్‌మెంట్ మొత్తం చిందరవందరగా వస్తువులు పడేసి ఉంది. జంతువుల మలమూత్రాలతో చెత్తదిబ్బలా మారిపోయింది. మహిళ డయాజీన్స్ అనే మానసిక సమస్యతో బాధపడేదిలా అనిపించింది. అలా ఉండే వారు వ్యక్తిగత శ్రద్ధ, శుభ్రత కనబరచకుండా సమాజానికి దూరంగా ఉంటారని ఇజ్రాయెల్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ కథనంలో ప్రచురించింది.