Virat Kohli : అయ్యో కోహ్లీ.. నీకు తప్పడం లేదుగా.. భార్యతో వెళితే.. ఓ చేతిలో గొడుగు, మరో చేతిలో..
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli ) ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్న సంగతి తెలిసిందే.

Virat Kohli and Anushka Sharma at london streets
Virat Kohli : పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్న సంగతి తెలిసిందే.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్‌మెంట్ ప్రకటించిన తరువాత అతడు అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటాడు అన్న వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం టెస్టులకు, టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లీ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు.
కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడు లండన్ వీధుల్లో తన సతీమణి అనుష్క శర్మతో కలిసి తిరుగుతూ ఉన్నాడు.
వీరిద్దరు నడుచుకుంటూ ఓ ఇద్దరు వీదేశీయులతో సరదాగా మాట్లాడుతూ ఉన్నట్లుగా ఆ వీడియోలో కనిపిస్తోంది.
చేతిలో గొడుగు..
కోహ్లీ ఓ చేతిలో గొడుగు, మరో చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని ఉండగా, అనుష్క శర్మ భుజానికి ఓ ఆకుపచ్చ రంగు హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ఉంది. ఈ వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఎంత పెద్ద స్టార్ క్రికెటర్ అయినా సరే భార్యతో వెలుతుంటే ముందు జాగ్రత్తలు తీసుకోక తప్పదు అని అంటున్నారు.
KKR : రాజస్థాన్‌కు బంఫర్ ఆఫర్ ఇచ్చిన కేకేఆర్..! సంజూని ఇస్తే.. ఇద్దరు ఆటగాళ్లతో పాటు..
VIRAT KOHLI & ANUSHKA SHARMA AT THE LONDON STREETS. ❤️
— Tanuj (@ImTanujSingh) August 17, 2025
ఇండియాలో అయితే.. తాను ఎక్కడి కన్నా వెళితే చుట్టూ అభిమానులు ఉంటారని, స్వేచ్ఛగా నడిచే అవకాశం ఉందని ఓ సందర్భంలో కోహ్లీ చెప్పాడు. అదే విదేశాల్లో అయితే తాము ఓ సాధారణ పౌరుల్లాగే అక్కడి రోడ్ల పై తిరగవచ్చునని, నచ్చినవి షాపింగ్ చేయవచ్చుని అన్నాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తరువాత చాలా కాలం పాటు ఎవ్వరికి కనిపించనని చెప్పిన సంగతి తెలిసిందే.
అక్టోబర్‌లోనే..
ఐపీఎల్ 2027 తరువాత కోహ్లీ మైదానంలో కనిపించలేదు. ఇక భారత జట్టు తరుపున కోహ్లీ చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. టెస్టులకు, టీ20లకు వీడ్కోలు పలకడంతో వన్డేల్లో మాత్రమే కోహ్లీని భారత జట్టు తరుపున చూసే అవకాశం ఉంది. అక్టోబర్ నెలలో భారత జట్టు ఆసీస్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 19 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ద్వారా కోహ్లీ మళ్లీ బ్లూ జెర్సీలో కనిపించే అవకాశం ఉంది.