Sowmya : నాన్నకు ఊరంతా అప్పులు.. అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్.. అన్నం కోసం ఎదురుచూపులు.. పాపం సౌమ్య కష్టాలు..

తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌమ్య తన లైఫ్ లో, తన ఫ్యామిలీ ఫేస్ చేసిన కష్టాలను చెప్పుకొచ్చింది.

Sowmya : నాన్నకు ఊరంతా అప్పులు.. అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్.. అన్నం కోసం ఎదురుచూపులు.. పాపం సౌమ్య కష్టాలు..

Sowmya

Updated On : August 18, 2025 / 11:02 AM IST

Sowmya : కన్నడ సీరియల్స్ లో నటిగా, అక్కడ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న సౌమ్య తెలుగులో కూడా పలు సీరియల్స్ చేసింది. జబర్దస్త్ లో యాంకర్ గా మెప్పించింది. ప్రస్తుతం పలు టీవీ షోలతో అలరిస్తుంది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌమ్య తన లైఫ్ లో, తన ఫ్యామిలీ ఫేస్ చేసిన కష్టాలను చెప్పుకొచ్చింది.

సౌమ్య మాట్లాడుతూ.. మా నాన్న ఊరంతా అప్పులు చేసారు. మమ్మల్ని పట్టించుకోలేదు. మా నాన్న గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. అప్పులు ఇచ్చిన అందరూ మా ఇంటికి వచ్చి మా అమ్మని టార్చర్ పెట్టారు. అప్పుడు నేను స్కూల్ ఏజ్. నన్ను చూసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడేవాళ్ళు. మా అమ్మ ఇవన్నీ అనుభవించి చాలా ఇరిటేట్ అయిపోయి నన్ను, మా బ్రదర్ ని, కొన్ని బట్టలు, 120 రూపాయలు తీసుకొని తిరుపతి తీసుకువెళ్ళింది. నైట్ బస్ స్టాండ్ లో పడుకున్నాం. రెండు రోజులు అన్నం తినలేదు. తిరుపతికి వెళ్ళాక ఎప్పుడు ఫుడ్ పెడతారు అని ఎదురు చూసేదాన్ని.

Also Read : TV Serials : హీరోయిన్ నన్ను కార్ తో గుద్దింది.. వామ్మో.. సీరియల్స్ లో ఇలా ఉంటారా? అక్కడ హీరోయిన్.. బయట ఏమో..

నేను కంప్లీట్ జీరో నుంచి వచ్చాను. ఇంటికి రిలేటివ్స్ వస్తే పక్కింటికి వెళ్లి కాఫీ, పంచదార అప్పుగా తెచ్చుకునేవాళ్ళం. అందుకే మేము వస్తున్నాం అంటే పక్కింటి వాళ్ళు తలుపులు వేసేసుకునేవాళ్ళు. అంత పేదరికం నుంచి వచ్చాం. ఒక్కోసారి అన్నం తినడానికి కూడా చాలా కష్టపడ్డాం. నేను పార్ట్ టైం జాబ్స్ చేస్తూ చదువుకున్నాను. మా అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్ అటాక్ అయింది. లోపల సెల్స్ చాలా డ్యామేజ్ అయ్యాయి. మా అమ్మకు అలా జరగకుండా ఉంటే బాగుండేది అనుకుంటాను అంటూ ఎమోషనల్ అయింది.