Mouli Tanuj Prasanth : ‘మా అప్పులన్నీ తీర్చేసా.. నాన్న ఆటో నడుపుతూ..’ నువ్వు గ్రేట్ బ్రో..
ఈ సినిమా ప్రమోషన్స్ లో మౌళి (Mouli Tanuj Prasanth)ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో తన గురించి తెలిపాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మౌళి మాట్లాడుతూ..

Mouli Tanuj Prasanth
Mouli Tanuj Prasanth : సోషల్ మీడియాలో మీమర్ గా, రీల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న మౌళి తనూజ్ ప్రశాంత్(Mouli Tanuj Prasanth) ఆ తర్వాత నటుడిగా మారాడు. 90s వెబ్ సిరీస్ తో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. మౌళి ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మౌళి, శివాని జంటగా లిటిల్ హార్ట్స్ అనే సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో మౌళి ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో తన గురించి తెలిపాడు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మౌళి మాట్లాడుతూ.. మాది అంత లగ్జరీ లైఫ్ కాదు. మా నాన్న ఆటో నడుపుతూ కిరాణా షాప్స్ కి సరుకులు వేస్తూ ఉంటారు. మాకు చాలా లోన్స్ ఉన్నాయి. అందుకే మా నాన్న ఎక్కువ కష్టపడేవాడు. 90s సిరీస్ తో ఆ అప్పులన్నీ తీర్చేసాను. నా బాధ్యత నేను చేశాను. అయినా మా నాన్న ఇప్పటికి అదే ఆటో నడుపుకుంటాడు. నేను వద్దని చెప్పినా ఆయన ఇష్టం. నేను ఎక్కువ సేవింగ్స్ చేస్తాను. మా ఫ్యామిలీ అప్పులు తీర్చినందుకు నాకు సంతోషంగా ఉంది అని తెలిపాడు.
మౌళి సోషల్ మీడియాలో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. మౌళి చెప్పిన విషయం వైరల్ అవ్వడంతో నువ్వు గ్రేట్ బ్రో ఇంట్లో బాధ్యతలు తీసుకున్నావు, కష్టపడి పైకి వచ్చావు అని పలువురు సోషల్ మీడియాలో మౌళిని అభినందిస్తున్నారు.