అట్లుంటది ఇండియా vs పాక్ మ్యాచ్ అంటే.. జస్ట్ 10 సెకన్ల యాడ్ కి ఏకంగా..

టోర్నీ ఏదైనా కానీ, భార‌త్‌, పాక్ (IND vs PAK ) త‌ల‌ప‌డుతున్నాయంటే చాలు మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి.

అట్లుంటది ఇండియా vs పాక్ మ్యాచ్ అంటే.. జస్ట్ 10 సెకన్ల యాడ్ కి ఏకంగా..

IND vs PAK Asia Cup 2025 Ad Rates Break Records

Updated On : August 18, 2025 / 11:44 AM IST

IND vs PAK : క్రికెట్‌లో భార‌త్ వ‌ర్సెస్ పాక్‌ మ్యాచ్‌కు ఉన్న క్రేజే వేరు. ఇరు జ‌ట్లు మైదానంలో త‌ల‌ప‌డుతున్నాయంటే రెండు దేశాల అభిమానులే కాదు యావ‌త్ క్రికెట్ ప్ర‌పంచం కూడా ఈ మ్యాచ్ పై ఆస‌క్తి చూపిస్తుంటుంది.

టోర్నీ ఏదైనా కానీ.. భార‌త్‌, పాక్ త‌ల‌ప‌డుతున్నాయంటే చాలు మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి.

ఇక టీవీ, ఓటీటీలో రికార్డు సంఖ్య‌లో మ్యాచ్‌ను వీక్షిస్తూ ఉంటారు.

అందుకనే వ్యాపార‌సులు కూడా త‌మ బ్రాండ్ల‌ను ప్ర‌మోట్ చేసుకోవ‌డానికి భార‌త్ వ‌ర్సెస్ పాక్ (IND vs PAK) మ్యాచ్‌కు మించి మ‌రొక‌టి ఉండ‌ద‌ని భావిస్తూ ఉంటారు.

ఈ క్ర‌మంలో మ్యాచ్ మ‌ధ్య‌లో త‌మ యాడ్స్ వ‌చ్చేలా చేసేందుకు పెద్ద మొత్తంలోనూ స‌మ‌ర్పించ‌డానికి వెనుకాడ‌రు.

అదే స‌మ‌యంలో ఈ మ్యాచ్ ప్ర‌సార హ‌క్కులు ద‌క్కించుకున్న ఛాన‌ళ్లు కూడా మిగిలిన మ్యాచ్‌ల‌తో పోలిస్తే.. ఈ మ్యాచ్‌కు యాడ్ రేట్లను అమాంతంగా పెంచుతూ ఉంటాయి.

Virat Kohli : అయ్యో కోహ్లీ.. నీకు త‌ప్ప‌డం లేదుగా.. భార్య‌తో వెళితే.. ఓ చేతిలో గొడుగు, మ‌రో చేతిలో..

10 సెక‌న్ల యాడ్ కోసం రూ.16ల‌క్ష‌లు..!

సెప్టెంబ‌ర్ 9 నుంచి ఆసియా క‌ప్ 2025 యూఏఈ వేదిక‌గా ప్రారంభం కానుంది. ఇక భార‌త్, పాక్ జ‌ట్ల మ‌ధ్య సెప్టెంబ‌ర్ 14న మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ఆసియా క‌ప్ ప్రసార హ‌క్కులు సోనీ స్పోర్ట్స్ నెట్‌వ‌ర్క్ వ‌ద్ద ఉన్నాయి. కాగా.. ఆంగ్ల మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాల ప్ర‌కారం భార‌త్‌, పాక్ జ‌ట్ల మ‌ధ్య ఆసియా క‌ప్‌లో జ‌ర‌గ‌నున్న మ్యాచ్ స‌మ‌యంలో యాడ్స్ కోసం పెద్ద మొత్తంలో వ‌సూలు చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఆసియాక‌ప్‌లో భార‌త్ ఆడే మ్యాచ్‌ల స‌మ‌యంలో 10 సెక‌న్ల యాడ్ స్లాట్‌కు రూ.14 నుంచి 16 ల‌క్ష‌లుగా నిర్ణ‌యించారు.

అదే భార‌త్‌, పాక్ మ్యాచ్ స‌మ‌యంలో మాత్రం 10 సెక‌న్ల యాడ్ కోసం రూ.16ల‌క్ష‌లుగా నిర్ణ‌యించిన‌ట్లుగా స‌ద‌రు వార్త‌ల సారాంశం.

KKR : రాజ‌స్థాన్‌కు బంఫ‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన కేకేఆర్‌..! సంజూని ఇస్తే.. ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌తో పాటు..

సెప్టెంబ‌ర్ 9 నుంచి 28 వ‌ర‌కు ఆసియా క‌ప్ జ‌ర‌గ‌నుంది. వ‌చ్చే ఏడాది టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఉండ‌డంతో పొట్టి ఫార్మాట్‌లో మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ టోర్నీలో టీమ్ఇండియా త‌న తొలి మ్యాచ్‌ను ఆతిథ్య యూఏఈతో సెప్టెంబ‌ర్ 10న దుబాయ్ వేదిక‌గా త‌ల‌ప‌డ‌నుంది.

డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా బ‌రిలోకి దిగ‌నున్న‌ భార‌త్ మ‌రోసారి టైటిల్‌ను సొంతం చేసుకోవాల‌ని భావిస్తోంది. ఈ టోర్నీలో పాల్గొనే భార‌త జ‌ట్టును మ‌రో రెండు మూడు రోజుల్లో బీసీసీఐ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. సూర్య‌కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోనే భార‌త్ బ‌రిలోకి దిగొచ్చు.