Yash Dhull : మెగావేలంలో అమ్ముడుపోలేదు.. కట్ చేస్తే ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో తుఫాన్ ఇన్నింగ్స్‌లు.. 180.25 స్ట్రైక్‌రేటుతో 292 పరుగులు
ఐపీఎల్ 2025 మెగావేలంలో నమోదు చేసుకున్నప్పటికి కూడా యశ్ ధుల్ (Yash Dhull) ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు.

DPL 2025 Yash Dhull has smashed two fiery centuries in just five innings
Yash Dhull : టీమ్ఇండియా అండర్-19 జట్టు మాజీ కెప్టెన్ యశ్ ధుల్ (Yash Dhull) కేవలం రెడ్ బాల్ క్రికెట్‌లో మాత్రమే రాణిస్తాడని, టీ20 ఫార్మాట్ అతడికి నప్పదనే అభిప్రాయం చాలా మందిలో ఉండేది. ఈ క్రమంలో ఐపీఎల్ 2025 మెగావేలంలో రూ.30లక్షల బేస్‌ప్రైజ్‌తో నమోదు చేసుకున్నప్పటికి కూడా ఈ యువ ఆటగాడిని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు.
ఈ నేపథ్యంలో తనలోనూ ఓ పవర్ హిట్టర్ ఉన్నాడని నిరూపిస్తున్నాడు యశ్ ధుల్.
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతూ తాను టీ20లకు చక్కగా సరిపోతానని నిరూపిస్తున్నాడు.
ఈ లీగ్‌లో సెంట్రల్ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు కేవలం ఐదు ఇన్నింగ్స్‌ల్లోనే రెండు శతకాలు బాదాడు. నిలకడగా రాణిస్తున్నాడు.
అట్లుంటది ఇండియా vs పాక్ మ్యాచ్ అంటే.. జస్ట్ 10 సెకన్ల యాడ్ కి ఏకంగా..
యశ్ ధుల్ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో అతడు ఆడిన తొలి మ్యాచ్‌లోనే మెరుపు శతకం సాధించాడు. 56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. ఇక రెండో మ్యాచ్‌లో 34 బంతుల్లో 55 పరుగులు చేయగా, మూడో మ్యాచ్‌లో 15 బంతుల్లో 29 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే.. నాలుగో మ్యాచ్‌లో విఫలం అయినప్పటికి కూడా ఐదో మ్యాచ్‌లో మరోసారి సెంచరీతో ఆకట్టుకున్నాడు. 51 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేశాడు.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు యశ్ ధుల్ ఐదు ఇన్నింగ్స్‌లు ఆడాడు. 146 సగటుతో 180.25 స్ట్రైక్‌రేటుతో 292 పరుగులు చేశాడు. యశ్ ధుల్ రాణిస్తుండడంతో సెంట్రల్ ఢిల్లీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
ఐపీఎల్ 2026 మినీలో వేలంలో జాక్‌పాట్?
ప్రస్తుతం యశ్ ధుల్ ఆటతీరు చూస్తుంటే.. ఐపీఎల్ 2026 మినీవేలంలో అతడి కోసం ఫ్రాంఛైజీలు పోటీపడొచ్చు. మంచి ధరను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Virat Kohli : అయ్యో కోహ్లీ.. నీకు తప్పడం లేదుగా.. భార్యతో వెళితే.. ఓ చేతిలో గొడుగు, మరో చేతిలో..
ఈ మినీ వేలం సమయాన్ని బీసీసీఐ ఇంకా వెల్లడించలేదు. అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో వేలం జరిగే అవకాశాలు ఉన్నాయి.