Astronaut Haircut: అంతరిక్షంలో హెయిర్‌కట్.. బార్బర్ రాజా స్పేస్ సెలూన్ చూశారా..

ఆస్ట్రనాట్ (వ్యోమగామి) మట్టియాస్ మౌరర్ ఓ వీడియో ట్వీట్ చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో తన సహచర సిబ్బందితో హెయిర్‌కట్ చేసుకున్న వీడియోను పోస్టు చేశారు.

Astronaut Haircut: అంతరిక్షంలో హెయిర్‌కట్.. బార్బర్ రాజా స్పేస్ సెలూన్ చూశారా..

Space Haircut

Updated On : December 23, 2021 / 7:16 AM IST

Astronaut Haircut: ఆస్ట్రనాట్ (వ్యోమగామి) మట్టియాస్ మౌరర్ ఓ వీడియో ట్వీట్ చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో తన సహచర సిబ్బందితో హెయిర్‌కట్ చేసుకున్న వీడియోను పోస్టు చేశారు. ఇద్దరూ కాళ్లతో రాడ్ పట్టుకుని నిలబడ్డారు. రాజాచారి అనే వ్యోమగామి ట్రిమ్మర్ సాయంతో సహచరుడికి హెయిర్ కట్ చేశారు.

ఆ ట్వీట్ లో బార్బర్ టాలెంట్  తో పాటు మల్టీ టాలెంటెడ్ పర్సన్ అంటూ పొగిడేశాడు మౌరర్. వ్యోమగాములు జుట్టును తన కళ్లలో ఉండనివ్వరని చెప్పాడు.

‘స్పేస్ సెలూన్ లోకి రండి. మ్యాన్ ఆఫ్ మల్టీ టాలెండ్స్ బార్బర్ ఆస్ట్రో రాజా ఉన్నారు. ఎందుకంటే వ్యోమగాముల కళ్లలో జుట్టు ఉంచుకోవడానికి ఇష్టపడరు. ఈ స్పేస్ స్టైలిస్ట్ సర్వీస్ కు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వాలి’ అని మౌరర్ రాసుకొచ్చారు. ఇటీవలి కాలంలో ఐఎస్ఎస్… ఫ్లోటింగ్ పిజ్జా పార్టీ, వ్యోమగాముల వర్కౌట్ వీడియోస్ పోస్టు చేసింది.

………………………………………..: తెలంగాణలో ఒక్కరోజే 14 ఒమిక్రాన్ కేసులు