Honey Bees: తేనె పరిశ్రమ కాపాడుకునేందుకు తేనెటీగలు చంపేస్తున్న ఆస్ట్రేలియా

రెండు వారాలుగా ఆస్ట్రేలియన్ అధికారులు మిలియన్ల కొద్దీ తేనెటీగలను నిర్మూలించారు. ఇదంతా దేశంలోని ఆగ్నేయ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తున్న వినాశకరమైన పరాన్నజీవి ప్లేగును నిరోధించేందుకేనని అధికారులు పేర్కొన్నారు.

Honey Bees: తేనె పరిశ్రమ కాపాడుకునేందుకు తేనెటీగలు చంపేస్తున్న ఆస్ట్రేలియా

Honey Bees

 

 

Honey Bees: రెండు వారాలుగా ఆస్ట్రేలియన్ అధికారులు మిలియన్ల కొద్దీ తేనెటీగలను నిర్మూలించారు. ఇదంతా దేశంలోని ఆగ్నేయ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తున్న వినాశకరమైన పరాన్నజీవి ప్లేగును నిరోధించేందుకేనని అధికారులు పేర్కొన్నారు.

గత వారం సిడ్నీకి సమీపంలోని ఓడరేవులో మొట్టమొదటగా నువ్వుల గింజల-పరిమాణ పరాన్నజీవి కనిపించింది. ప్రాణాంతకమైన వరోవా మైట్ వ్యాప్తికి ఇది కారణమవుతుంది. ఫలితంగా మల్టీ మిలియన్ డాలర్ల తేనె పరిశ్రమకు భారీ ముప్పును కలిగిస్తుంది.

వ్యాప్తిని పరిమితం చేయడానికి విస్తృత శ్రేణి బయోసెక్యూరిటీ చర్యలలో భాగంగా తేనెటీగలు ఉండే ప్రదేశాలు “లాక్‌డౌన్”లో ఉంచేశారు.

“తేనెటీగల పెంపకందారులు న్యూకాజిల్ ప్రాంతంలోని సామాగ్రిని అక్కడి నుంచి కదిలించడం లేదు” అని ఆస్ట్రేలియన్ హనీ బీ ఇండస్ట్రీ కౌన్సిల్ పేర్కొంది.

Read Also: కొంపముంచిన ప్రీ వెడ్డింగ్ షూట్.. ఆసుపత్రిలో కొత్త జంట

ప్రపంచవ్యాప్తంగా తేనెటీగలకు అతిపెద్ద ముప్పుగా పరిగణించే వర్రోవా మైట్-ప్రేరిత ప్లేగుల వ్యాప్తిని విజయవంతంగా అరికట్టగలిగిన దేశాలలో ఆస్ట్రేలియా ఒకటి. ఈసారి మాత్రం చిన్నపాటి పురుగు కారణంగా ఎక్కువ శ్రమించాల్సి వస్తుందని అధికారులు అంటున్నారు.

వర్రోవా మైట్, లేదా వర్రోవా డిస్ట్రక్టర్, తేనెటీగలపై దాడి చేసి ఆహారం తీసుకునే పరాన్నజీవి. ఎరుపు-గోధుమ రంగులో, చిన్న తెగుళ్లు తేనెటీగల మొత్తం నివాసాలను చంపేస్తాయని అధికారులు హెచ్చరించారు. తరచుగా తేనెటీగ నుండి తేనెటీగకు, తేనెటీగలకు వాడే పరికరాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు.

వర్రోవా పురుగులు వయోజన తేనెటీగలను తిని జీవిస్తాయి. అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న సంతానంలోని లార్వా, ప్యూపాపై పునరుత్పత్తి చేయడం వల్ల తేనెటీగలు వైకల్యానికి, బలహీనతకు కారణమవుతాయి.