Biotech CEO Bryan Johnson : 18 ఏళ్ల యువకుడిగా కనిపించటానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్న సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవో

18 ఏళ్ల యువకుడిగా కనిపించటానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్న సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవో. దీని కోసం ఏడాదికి రూ. 16.3 కోట్లు ఖర్చుపెడుతున్నారు.ప్రతీ మనిషి జీవితంలోను బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనేవి సర్వసాధారణం. కానీ ఓ శ్రీమంతుడు మాత్రం ఎప్పటికి యవ్వనంలోనే ఉండిపోవాలని పడుతున్న తపన నెరవేరుతుందా? ఎప్పటికి నవ యవ్వనంగా ఉండగలరా?

Biotech CEO Bryan Johnson : 18 ఏళ్ల యువకుడిగా కనిపించటానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్న సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవో

Biotech CEO Bryan Johnson

Biotech CEO Bryan Johnson : 18 ఏళ్ల నవ యవ్వనంగా ఉండిపోవాలంటే వీలవుతుందా? ప్రతీ మనిషి జీవితంలోను బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనేవి సర్వసాధారణం. ఈ జీవిత ప్రక్రియకు పేద గొప్పా అనే తేడా ఉండదు. కానీ ఓ శ్రీమంతుడు మాత్రం తనకున్న అపారమైన డబ్బుతో ఎప్పటికి యవ్వనంలోనే ఉండిపోవాలని తపనపడుతున్నాడు. 18 యువకుడిగా ఉండిపోవటానికి డబ్బును మంచినీళ్లలా ఖర్చుపెడుతున్నాడు. వైద్యం రంగంలో వచ్చిన వినూత్న మార్పులు..టెక్నాలజీతో 45 వయస్సున్న ఆ శ్రీమంతుడు 18 ఏళ్ల యువకుడిలా కనిపించటానికి సంవత్సరానికి 16.3 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు.

18 ఏళ్ల యువకుడిలా మారటానికి 45 ఏళ్ల బ్రయాన్ జాన్సన్ అనే మిలియనియర్ ఏడాదికి 16.3 కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు 18 ఏళ్ల యువకుడి ఊపిరితిత్తుల సామర్థ్యం, శారీరక పట్టు, 28 ఏళ్ల వ్యక్తి మాదిరి చర్మం, 37 ఏళ్ల వ్యక్తి మాదిరి గుండె సామర్థ్యాన్ని పొందారు. వయస్సు పైబడుతుంటే కొంతమంది యంగ్ గా కనిపించటానికి రకరకాల కసరత్తులు చేస్తుంటారు.మరికొందరు కాస్మెటిక్స్ సర్జరీ చేయించుకుంటుంటారు.

కానీ అమెరికాకు చెందిన 45 ఏళ్ల మిలియనర్‌ బ్రయాన్ జాన్సన్ మాత్రం నా స్టైలే వేరు అన్నట్లుగా ఏకంగా శరీరం దృఢత్వంతోపాటు అవయవాలు కూడా యువకుడిలా పనిచేయటంకోసం ఏడాదికి సుమారు 16.3 కోట్లు (రెండు మిలియన్‌ డాలర్లు) ఖర్చు చేస్తున్నారు. వయసును రివర్స్‌ చేసే ఖరీదైన వైద్య విధానాలను పాటిస్తున్నారని బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది.

కాలిఫోర్నియాలోని వెనిస్‌కు చెందిన 45 ఏళ్ల బ్రయాన్ జాన్సన్ శ్రీమంతుడు. అల్ట్రావెల్తీ సాఫ్ట్‌వేర్ కంపెనీ వ్యవస్థాపకుడు. బయోటెక్నాలజీ రంగంలో అపార అనుభవం కలిగిన వ్యక్తి. తాను 18 ఏళ్ల యువకుడిలా ఉండాలని అనుకోవటమే కాదు దాని కోసం ఎన్నో పుస్తకాలు చదివారు. శాస్త్రీయ అవగాహన పెంచుకున్నారు. అవగాహన పెంచుకోవటమేకాదు దాని కోసం ఆయన సాహసం చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే అది కేవలం డబ్బు ఉంటే చేయించుకునేది కాదు. డబ్బుందనే అహంతోను ఆయన ఈ వైద్య విధానం పాటించటంలేదు. ఈ అంశంపై పట్టుండటంతోపాటు గునియా పందిపై పరిశోధనలు చేస్తున్న 29 ఏళ్ల పునరుత్పత్తి మెడిసిన్‌ డాక్టర్‌ ఆలివర్ జోల్మాన్ నేతృత్వంలో వయసు తగ్గించుకునే పనిలో పడ్డారు జాన్సన్. 30 మంది అత్యాధుని వైద్య నిపుణులు నిరంతరం దీని కోసం పనిచేస్తున్నారు. ఆరోగ్య రంగ నిపుణుల పర్యవేక్షణలో 18 ఏళ్ల వ్యక్తిగా మారేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ వైద్య విధానంకోసం ఆయన నివాసంలో ఏకంగా ఒక మెడికల్‌ సూట్‌ను ఏర్పాటు చేశారు.దీని కోసం కోటాను కోట్లు ఖర్చు చేస్తున్నారు.

ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు 18 ఏళ్ల యువకుడి ఊపిరితిత్తుల సామర్థ్యం, శారీరక పట్టు, 28 ఏళ్ల వ్యక్తి మాదిరి చర్మం, 37 ఏళ్ల వ్యక్తిలా గుండె సామర్థ్యం పొందారు. అంతేకాదు మెదడు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, దంతాలు, జుట్లు, మూత్రాశయం,దంతాలతో పాటు పురుషాంగం కూడా 18 యువకుడిలా ఉండటానికి జాన్సన్ అత్యాధునిక వైద్య నిపుణుల బృందంతో వైద్య విధానాలను పొందుతున్నారు.

జాన్సన్‌ శరీరంలోని అన్ని అవయవాల వృద్ధాప్య ప్రక్రియను తిప్పికొట్టి 18 ఏళ్ల వ్యక్తి శరీరంతోపాటు అవయవాలుగా తీర్చిదిద్దడానికి తాను కట్టుబడి ఉన్నానని డాక్టర్‌ ఆలివర్ జోల్మాన్ చెబుతున్నారు. మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, నరాలు, దంతాలు, చర్మం, జుట్టు, మూత్రాశయం, పురుషాంగం సహా అన్ని శరీర భాగాలు, అవయవాలను 18 ఏళ్ల యువకుడి మాదిరిగా జాన్సన్‌ కోరుకుంటున్నారని డాక్టర్ ఆలివర్ తెలిపారు. దీని కోసం జాన్సన్ రెండు మిలియన్‌ డాలర్లు ఖర్చు చేయాలని నిర్ణయించారని తెలిపారు.