Boris Johnson: రాజీనామా చేయాల‌ని బ్రిటన్ ప్ర‌ధాని బోరిస్‌ జాన్సన్ నిర్ణ‌యం

మంత్రులు, ఎంపీల మద్దతును బోరిస్ జాన్స‌న్ కోల్పోయారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా వైదొలగనున్నారు. కొన్ని రోజుల అనంత‌రం కన్జర్వేటివ్ పార్టీకి కొత్త నాయకుడిని ఎన్నుకుని, అక్టోబరులో బ్రిట‌న్ కొత్త ప్రధానిని ఎన్నుకుంటారు. నేడు బోరిస్ జాన్సన్ రాజీనామా ప్ర‌క‌టించినా ఆప‌ద్ధ‌ర్మ‌ ప్రధానిగా అక్టోబ‌రు వ‌ర‌కు కొనసాగుతారు.

Boris Johnson: రాజీనామా చేయాల‌ని బ్రిటన్ ప్ర‌ధాని బోరిస్‌ జాన్సన్ నిర్ణ‌యం

Boris

Boris Johnson: బ్రిటన్ ప్ర‌ధాని బోరిస్‌ జాన్సన్ త‌న ప‌ద‌వికి ఇవాళ రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. జాన్సన్‌పై విశ్వాసం కోల్పోయామంటూ ఇటీవ‌లే దాదాపు 40 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మొద‌ట తాను ఎట్టిప‌రిస్థితుల్లోనూ రాజీనామా చేయ‌బోమ‌ని బోరిస్‌ జాన్సన్ చెప్పారు. అయితే, క్ర‌మంగా ఆయ‌న‌పై ఒత్తిడి పెరిగిపోయింది. క‌రోనా లాక్‌డౌన్ వేళ 10 డౌనింగ్‌ స్ట్రీటుతో పాటు మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌, ‘పార్టీ గేట్‌’ కుంభకోణం పేరుతో మ‌రిన్ని అంశాలు బ‌య‌ట‌కు రావ‌డంతో ఆయ‌న రాజీనామా చేయాలంటూ డిమాండ్ పెరిగిపోయింది.

Maharashtra: ఏక్‌నాథ్ షిండే కేబినెట్‌లో 25 మంది బీజేపీ నేత‌ల‌కు చోటు?

చివ‌ర‌కు మంత్రులు, ఎంపీల మద్దతును బోరిస్ జాన్స‌న్ కోల్పోయారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా వైదొలగనున్నారు. కొన్ని రోజుల అనంత‌రం కన్జర్వేటివ్ పార్టీకి కొత్త నాయకుడిని ఎన్నుకుని, అక్టోబరులో బ్రిట‌న్ కొత్త ప్రధానిని ఎన్నుకుంటారు. నేడు బోరిస్ జాన్సన్ రాజీనామా ప్ర‌క‌టించినా ఆప‌ద్ధ‌ర్మ‌ ప్రధానిగా అక్టోబ‌రు వ‌ర‌కు కొనసాగుతారు.