Rishi Sunak: ‘జై సీతారాం’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన బ్రిటన్ ప్రధాని.. నెట్టింట్లో వీడియో వైరల్

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మొరారీ బాపు రామ్ కథకు హాజరు కావడం తనకు గౌరవంగా భావిస్తున్నానని ప్రధాని సునక్ అన్నారు

Rishi Sunak: ‘జై సీతారాం’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన బ్రిటన్ ప్రధాని.. నెట్టింట్లో వీడియో వైరల్

Updated On : August 16, 2023 / 2:24 PM IST

Jai Siya Ram: బ్రిటన్ రాజధాని లండన్‭లో ఉన్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో మంగళవారం (ఆగస్టు 15) జరిగిన ప్రముఖ కథకుడు మొరారీ బాపు రామాయణ పఠనానికి బ్రిటన్ ప్రధాని రిషి సునక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అక్కడికి ప్రధానిగా కాకుండా హిందువుగా వచ్చానని అన్నారు. దీనికి ముందు తన ప్రసంగం ప్రారంభంలో ‘జై సీతారాం’ (సియారాం) అని అన్నారు. కాగా, బ్రిటన్ ప్రధాని ఇలా అనడం పట్ల చాలా ఆసక్తి నెలకొంది. ఈ వీడియోను నెటిజెన్లు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.


కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మొరారీ బాపు రామ్ కథకు హాజరు కావడం తనకు గౌరవంగా భావిస్తున్నానని ప్రధాని సునక్ అన్నారు. ‘‘నేను ఈరోజు ఇక్కడికి ప్రధానమంత్రిగా రాలేదు, హిందువుగా’ వచ్చాను. నమ్మకం నాకు చాలా వ్యక్తిగతమైనది. ఇది నా జీవితంలోని ప్రతి అంశంలో మార్గనిర్దేశం చేస్తుంది. ప్రధాని కావడం గొప్ప గౌరవం, అయితే అది అంత తేలికైన పని కాదు. మేము కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, కఠినమైన సవాళ్లను ఎదుర్కోవాలి. అయితే నమ్మకం అనేది నా దేశానికి ఉత్తమమైనదాన్ని చేయడానికి నాకు ధైర్యం, బలం, స్థితిస్థాపకతను ఇస్తుంది’’ అని అన్నారు.