Qatar Airways: బాయ్‌కాట్ ఖతర్ ఎయిర్‌వేస్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవడానికి కారణం

బీజేపీ నేతలైన నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన వ్యాఖ్యలపై భారతదేశం 15 దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన వారిలో ఖతర్ కూడా ఉంది. అలాంటి వ్యాఖ్యలు హింసకు, ద్వేషపూరితమైన సమాజానికి కారణం కావొచ్చని దీపక్ మిట్టల్ అన్నారు.

Qatar Airways: బాయ్‌కాట్ ఖతర్ ఎయిర్‌వేస్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవడానికి కారణం

Qatar

Qatar Airways: బీజేపీ నేతలైన నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన వ్యాఖ్యలపై భారతదేశం 15 దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన వారిలో ఖతర్ కూడా ఉంది. అలాంటి వ్యాఖ్యలు హింసకు, ద్వేషపూరితమైన సమాజానికి కారణం కావొచ్చని దీపక్ మిట్టల్ అన్నారు.

దౌత్యపరమైన సంక్షోభాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, ‘#BycottQatarAirways’ హ్యాష్‌ట్యాగ్‌తో పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను సోమవారం ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో ట్రెండింగ్ గా మారింది.

కొంతమంది ట్విట్టర్ వినియోగదారులు ఖతర్.. భారతీయులను లక్ష్యంగా చేసుకుంటోందని, కాబట్టి ప్రజలు ఖతార్ ఎయిర్‌వేస్‌ను బహిష్కరించడానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు.

Read Also: కువైత్‌లోని సూప‌ర్ మార్కెట్ నుంచి భార‌తీయ ఉత్ప‌త్తుల‌ తొలగింపు.

మహ్మద్ ప్రవక్తను కించపరుస్తున్నట్లుగా చేసిన కామెంట్లకు గానూ నవీన్ జిందాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించగా, నుపుర్ శర్మను బీజేపీ సస్పెండ్ చేసింది.

“ఏదైనా శాఖను లేదా మతాన్ని అవమానించే లేదా కించపరిచే భావజాలానికైనా ఇది వ్యతిరేకం” “అలాంటి వ్యక్తులను లేదా తత్వశాస్త్రాన్ని ప్రోత్సహించదు” అని బీజేపీ స్టేట్మెంట్ ఇచ్చింది.

పెద్ద సంఖ్యలో పలు దేశాల నుంచి ప్రభుత్వం ఎదురుదెబ్బలు ఎదుర్కొంటుండగా.. అన్ని మతాలను గౌరవిస్తామని చెప్పారు. ఒక ప్రకటనలో, విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యలు “ఈ కామెంట్లు ప్రభుత్వానికి సంబంధించిన వారు చేసినవి కావని, ఇవి ప్రభుత్వ అభిప్రాయాలు కావు” అంటూ సెలవిచ్చింది కేంద్ర ప్రభుత్వం.