చైనాలో ముస్లిం మహిళలకు బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు..అబార్షన్లు

  • Published By: nagamani ,Published On : July 1, 2020 / 04:56 PM IST
చైనాలో ముస్లిం మహిళలకు బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు..అబార్షన్లు

చైనా ముస్లిం మైనారిటీల జనాభాను తగ్గించటానికి బలవంతపు కుటుంబ నియంత్రణ చర్యలు చేపట్టింది. ఉయ్‌ఘర్‌ ముస్లింల జనాభాను తగ్గించేందుకు చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

చైనాలోని షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో ఉయ్‌ఘర్‌ జనాభా ఎక్కువగా ఉంటుంది. ఈ మతానికి చెందిన మహిళల్ని టార్గెట్ చేసిన చైనా ప్రభుత్వం ఇద్దరు, ముగ్గురుపిల్లలకు కంటే ఎక్కువున్నవారికి ఇష్టం లేకున్నా..బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తోంది. పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకోవాలని..లేదంటే సంతాన నిరోధక పరికరాలు(IUD) వాడాలని చైనా ప్రభుత్వం ఉయ్ ఘుర్ మహిళలపై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది.

కుటుంబ నియంత్రణ చేయించుకోని వేలాది మంది ముస్లిం మహిళలకు గర్భస్త్రావం చేయిస్తున్నట్లుగా ఓ పరిశోధలో వెల్లడైంది. దీనిపై మానవహక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. పుట్టే హక్కుని చైనా ప్రభుత్వం కాలరాస్తోందని చైనాపై విచారణకు ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకోవాలని మానవహక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

షిన్‌జియాంగ్‌లో ముస్లిం జనాభాను తగ్గించటానికి చైనా ప్రభుత్వం అత్యంత భారీగా ఖర్చుచేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన చైనా ప్రభుత్వం ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేసింది. బలవంతపు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు అనేది వట్టి అబద్దమని అంటోంది.మతపరమైన ఉగ్రవాదంతో పాటు ఉగ్రవాదాన్ని నిరోధించడానికి ఈ శిబిరాలు అవసరమని బీజింగ్ నొక్కి చెబుతోంది.

కాగా..ముస్లిం మైనారిటీలను నిర్బంధ శిబిరాల్లో ఉంచి వారిని దారుణంగా హింసిస్తున్నారని చైనాపై కొన్నేళ్లనుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ముస్లిం మహిళలకు బలంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయటం..విననివారికి గర్భస్రావాలు చేస్తున్నారనేవిషయం మరోసారి సంచలనంగా మారింది.

కాగా..చైనా 10 లక్షల మంది ఉయ్‌ఘర్‌ ముస్లింలను..ఇతర ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలను పశ్చిమ షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో నిర్బంధించిందని తమ దృష్టికి వచ్చిందని ఐక్యరాజ్యసమితి 2019 ఆగస్టులో పేర్కొంది. దీనిపై స్పందించని చైనా ఐక్యరాజ్యసమితికి కూడా తప్పుడు సమాచారం ఇస్తూ.. షిన్‌జియాంగ్‌ ప్రాంతంలోనివన్నీ రీ-ఎడ్యూకేషన్‌ క్యాంపులని చైనా బొంకుతోంది.

ఇటువంటి దుర్మార్గపు పనులను వెంటనే నిలిపేయాలని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చైనాకు సూచించారు. ఈ అమానవీయ చర్యల్ని అన్ని దేశాలు అమెరికాతో పాటు గళాన్ని కలపాలని ఆయన కోరారు.

గత కొన్నేళ్లుగా వీగర్‌ ముస్లింల విషయంలో చైనా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో చాలామంది వీగర్‌ ముస్లిం చిన్నారులను ఒక పద్దతి ప్రకారం తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తున్నారని, ముస్లిం సమాజానికి దూరంగా ఉంచుతున్నారని 2019లో బీబీసీ నిర్వహించిన ఒక దర్యాప్తులో తేలింది.

Read:TikTok పనిచేయడం లేదు.. ఈ భారతీయ యాప్స్ ఓసారి ట్రై చేయండి!