Corona Is back : చైనాలోని వుహాన్ లో మళ్లీ కరోనా కలకలం..బేజారెత్తుతున్న అధికారులు

చైనాలో మరోసారి కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి.వుహాన్ అంటే ఠక్కున గుర్తుకొచ్చే కరోనా మరోసారి వుహాన్ ను బెంబేలెత్తిస్తోంది.దీంతో అధికారులు భారీ సంఖ్యలోపరీక్షలు నిర్వహిస్తున్నారు. కఠిన ఆంక్షలు విధిస్తున్నారు.

Corona Is back : చైనాలోని వుహాన్ లో మళ్లీ కరోనా కలకలం..బేజారెత్తుతున్న అధికారులు

China Wuhan City To Test All Residents As Civid 19 Returns

Covid-19 is back in china Wuhan : కరోనాకు పుట్టినిల్లు చైనాలో మరోసారి మహమ్మారిఎంట్రీ ఇచ్చింది. వుహాన్ లో వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో వుహాన్ నగరంలోని 1.1 కోట్ల జనాభాకు కరోనా పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనాను గుర్తించేందుకు న్యూక్లిక్ యాసిడ్ పరీక్షను ప్రారంభిస్తున్నామని లిటావో అనే ఓ సీనియర్ అధికారి మంగళవారం (ఆగస్టు 3,2021)మీడియాకు తెలిపారు. వుహాన్ లో కరోనా కేసులు వెలుగులోకి వచ్చిన వెంటనే కఠిన ఆంక్షలను విధించారు. దీంతో..అక్కడ వైరస్ అదుపులోకి వచ్చింది. ఏడాదిన్నర తర్వాత అక్కడ ఏడు కేసులు బయటపడ్డాయి. ఏడుగురు వలస కార్మికుల్లో ఆ కేసులను గుర్తించారు. ఈ క్రమంలో రీసెంట్ గా 61 మందికి కరోనా సోకింది.

ప్రస్తుతం చైనాలో డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందటంతో దాదాపు అన్ని నగరాల్లో ఆంక్షల్ని విధిస్తున్నారు.వాటిని అమలు జరిగేలా కఠిన చర్యల్ని తీసుకుంటున్నారు. గతంలో వలెనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆంక్షలు విధించారు. ప్రభుత్వం రవాణా సదుపాయాలను బాగా తగ్గించింది. ఇదే సమయంలో కరోనా పరీక్షలను కూడా భారీ సంఖ్యలో నిర్వహిస్తోంది.నెల రోజులుగా పరీక్షల్ని నిర్వహిస్తోంది. బీజింగ్ తో సహా ప్రధాన నగరాల్లో మిలియన్నలమందికి పరీక్షలు చేశారు.పరీక్షలు నిర్వహించిన వారికి కాంటాక్ట్ అయినవారిని నిర్భంధంలో ఉంచారు. దీంతో యంగ్ జౌ నగరంకేంద్రంలోని 1.3 మిలియన్ల కు పైగా జనాలకు ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసరాల కోసం షాపింగ్ చేయటానికి ఒక ఇంటినుంచి ఒక్కరిని మాత్రమే బయటకు రావటానికి నగర పాలనా అధికారులు అనుమతి ఇస్తున్నారు.

మధ్య చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని టూరిస్టు ప్రాంతమైన నాంజింగ్‌ తో పాటు సమీపంలోని Zhuzhou నగరానికి ఇటీవలి రోజుల్లో రెండు మిలియన్ల మందికి ఆదేశాలు జారీ చేశారు. నాంజింగ్ ఎయిర్ పోర్టు లోని వ్యాధి సోకిన వ్యక్తులు గత నెలలో థియేటర్లకు వెళ్లారు. అలా నాంజింగ్ నుంచి ఈ వ్యాప్తి వుహాన్ కు వ్యాప్తి చెందింది. అప్పటి నుంచి అధికారులు పర్యాటక ప్రాంతాలకు వెళ్లవద్దని కోరుతున్నారు.

ఇంతలో బీజింగ్ వేసవి సెలవుల ప్రయాణ సీజన్ లో పర్యాటకులు రాజధాని బీజింగ్ కు రాకుండా నిరోధించారు. అవసరమైతే తప్ప నివాసితులు బయటకు రావద్దని సూచించారు.కాగా..వుహాన్‌లో కరోనావైరస్ మొదట వ్యాపించిన తరువాత కేసులను జీరో కేసులకు తగ్గించటంలో విజయం సాధించినందుకు చైనా గతంలో గొప్పగా చెప్పుకుంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి వీలు కల్పించింది. కానీ తాజాగా జూలై మధ్య నుండి 400 కంటే ఎక్కువ కేసులతో మరోసారి కరోనా కోరల్లో చిక్కుకోకుండా కఠిన చర్యలు అమలు చేస్తూ అప్రమత్తంగా ఉండటానికి తగిన చర్యలు చేపడుతోంది. దీని కోసం ముప్పుతిప్పలు పడుతోంది.జనాలకు ఆంక్షలు విధిస్తోంది.