Commentator Singing: స్టేడియంలో అమ్మాయిని చూడగానే కామెంట్రీ ఆపేసి పాట మొదలెట్టిన కామెంటేటర్

ఫ్యాన్స్ లేని స్పోర్ట్స్ అస్సలు మజా ఉండదుగాక ఉండదు.. స్టేడియంలో అభిమానులు వచ్చి కూర్చొని గేమ్ ఎంజాయ్ చేస్తుంటే జోష్ రెట్టింపవుతుందనేది నిజమే. అంతేకాకుండా ఒక్కోసారి దానికి గ్లామర్ యాడ్ అయితే కామెంటేటర్ల మాటల్లో మరింత ఉత్సాహం కనిపిస్తుంది.

Commentator Singing: స్టేడియంలో అమ్మాయిని చూడగానే కామెంట్రీ ఆపేసి పాట మొదలెట్టిన కామెంటేటర్

Girl On Stadium

Commentator Singing: ఫ్యాన్స్ లేని స్పోర్ట్స్ అస్సలు మజా ఉండదుగాక ఉండదు.. స్టేడియంలో అభిమానులు వచ్చి కూర్చొని గేమ్ ఎంజాయ్ చేస్తుంటే జోష్ రెట్టింపవుతుందనేది నిజమే. అంతేకాకుండా ఒక్కోసారి దానికి గ్లామర్ యాడ్ అయితే కామెంటేటర్ల మాటల్లో మరింత ఉత్సాహం కనిపిస్తుంది. అది క్రికెట్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, ఎలాంటి గేమ్స్ అయినా సరే..

రీసెంట్ గా జరిగిన ఘటన ఒకటి నెట్టింట వైరల్ అయింది. కాకపోతే మ్యాచ్ లో జోష్ నింపడం పోయి కామెంటేటర్ వేరే మూడ్ లోకి వెళ్లిపోయాడు. స్టాండ్ లో కూర్చొన్న యువతి చూయింగ్ గమ్ నములుతూ.. చుట్టూ చూస్తూ కూర్చొంది. స్టేడియంలో ప్రేక్షకులను చూపిస్తున్న క్రమంలో కెమెరా అటుగా తిరిగి ఆమెను చూడగానే జూమ్ అయింది.

అంతే పదే పదే అదే రెట్టింపు అవడంతో కామెంటేటర్ కూడా గొంతువిప్పాడు. గేమ్ గురించి చెప్పడం మానేసి ఆమెపై పాట పాడటం మొదలుపెట్టాడు. ఈ వైరల్ వీడియోకు దాదాపు 3.1 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. వీడియో చూసి వాళ్లు ఎంజాయ్ చేస్తే.. ఇదంతా తప్పని, కెమెరామెన్ ప్రొఫెషనల్ గా వ్యవహరించలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఆ అరబ్ కామెంటేటర్ పాడిన పాట అర్థం కావడం లేదని మరో నెటిజన్ పెట్టిన కామెంట్ కు ట్రాన్స్‌లేట్ చేసి పోస్టు చేశాడు మరో నెటిజన్.