గబ్బిలం, పాంగోలిన్.. కరోనా వైరస్‌కు అసలు కారణం ఏంటి

కరోనా వైరస్. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగుచూసిన ఈ మహమ్మారి చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ 180 దేశాలకు

  • Published By: veegamteam ,Published On : March 21, 2020 / 03:36 AM IST
గబ్బిలం, పాంగోలిన్.. కరోనా వైరస్‌కు అసలు కారణం ఏంటి

కరోనా వైరస్. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగుచూసిన ఈ మహమ్మారి చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ 180 దేశాలకు

కరోనా వైరస్. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగుచూసిన ఈ మహమ్మారి చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ 180 దేశాలకు విస్తరించింది. 2లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 11వేల మంది చనిపోయారు. ఇంకా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరిగే సూచనలు ఉన్నాయి. యావత్ ప్రపంచాన్ని గజగజవణికిస్తున్న కరోనా వైరస్.. ఎలా వచ్చింది? అసలు ఏ జాతి నుంచి, జంతువు నుంచి కరోనా వైరస్ వచ్చింది? దీనికి మూలం ఏంటి? అనేది మిస్టరీగా మారింది.

కరోనా వైరస్ కు అసలు మూలం తెలుసుకునేందుకు విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. తాజా అధ్యయనంలో కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఏ జాతి జంతువులో కరోనా వచ్చింది అనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. గబ్బిలం ద్వారా వచ్చిందా? పాంగోలిన్ ద్వారా వచ్చిందా? లేక మరో జంతు జాతి మూలమా? చైనాలోని హుబే ప్రావిన్స్ లోని గుహల నుంచి వచ్చిందా? అడవుల నుంచి వచ్చిందా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.

2019 డిసెంబర్ 27న 41మంది ఆసుపత్రి పాలయ్యారు. హుబే ప్రావిన్స్ లోని వుహాన్ సిటీలోని మార్కెట్ సమీపంలో ముందుగా కొందరకి ఈ వైరస్ సోకింది. అది మొదలు చైనాలో క్రమంగా కరోనా వైరస్ విస్తరించింది. అక్కడి నుంచి ఇతర దేశాలకు పాకింది. చూస్తుండగానే మనుషులు పిట్టల్లా రాలిపోయారు. కరోనా వైరస్ కి మూలం తెలుసుకునేందుకు చేసిన పరిశోధనల్లో betacoronaviruses(బీటా కరోనావైరస్ లు) కనుగొన్నారు. ఇవి ప్రధానంగా గబ్బిలాల్లో(bat) ఉంటాయి. యునాన్ ప్రావిన్స్‌లో సేకరించిన రినోలోఫస్ అఫినిస్ జాతి గబ్బిలం నుండి వేరుచేయబడిన RaTG13, ఇటీవల SARS-CoV-2 కు సమానమైనదిగా గుర్తించారు. జన్యు శ్రేణులు 96శాతం సమానంగా ఉంటాయి. ఈ ఫలితాలు గబ్బిలాలు, రినోలోఫస్ జాతికి చెందిన ప్రత్యేక జాతులలో, SARS-CoV , SARS-CoV-2 వైరస్ లు కలిగి ఉన్నాయని సూచించాయి.

అదే సమయంలో మరో జాతికి చెందిన జంతువు జన్యువు పైనా పరిశోధనలు జరిగాయి. 2020 ఫిబ్రవరి 7, SARS-CoV-2 కి దగ్గరగా ఉన్న వైరస్ పాంగోలిన్‌లో(pangolin) కనుగొన్నారు. 99శాతం జన్యు సంబంధమైన సమన్వయంతో, ఇది గబ్బిలాల కంటే ఎక్కువ జలాశయాన్ని సూచించింది. మలేషియా పాంగోలిన్ (మానిస్ జవానికా) నుండి వేరు చేయబడిన కరోనా వైరస్ జన్యువు SARS-Cov-2 కు తక్కువ సారూప్యతను కలిగి ఉందని, ప్రస్తుతం 90శాతం జన్యు సంబంధమైన సమన్వయంతో సమీక్షలో ఉంది. పాంగోలిన్‌లో వేరుచేయబడిన వైరస్ ప్రస్తుతం ఉధృతంగా ఉన్న COVID-19 అంటువ్యాధికి కారణం కాదని ఇది సూచిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

See Also | కరోనా దెబ్బ : పెళ్లికి రండి..మాస్క్‌లు పంపిణీ చేసిన వరుడు

పాంగోలిన్ నుండి వేరుచేయబడిన కరోనా వైరస్ S ప్రోటీన్ ఒక నిర్దిష్ట ప్రాంతంలో 99శాతం దగ్గర ఉంటుంది. ఇది ACE (యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2) రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో పాల్గొన్న 74 అమైనో ఆమ్లాలకు అనుగుణంగా ఉంటుంది. వైరస్ మానవ కణాలలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. దీనికి విరుద్ధంగా గబ్బిలం జన్యువు ఉది. పాంగోలిన్ నుండి వేరు చేయబడిన కరోనా వైరస్ మానవ కణాలలోకి ప్రవేశించగలదని తెలుసుకున్నారు. గబ్బిలం నుంచి ఛాన్స్ తక్కువ అని కనుగొన్నారు.

మొత్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ కు అసలు మూలం ఏంటి అనేది తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కరోనా వైరస్ కు చైనీయులే కారణం అని ఆరోపణలు ఉన్నాయి. వారి ఆహారపు అలవాట్ల వల్లే కరోనా వచ్చిందని అంటున్నారు. చైనీయులు గబ్బిలాలు, కుక్కలు, పిల్లులు, పాంగోలిన్ వంటి వాటిని తింటారని, ఆ విపరీత ఆహారపు అలవాట్ల వల్లే కరోనా వైరస్ మహమ్మారి వచ్చిందని మండిపడుతున్నారు. చైనీయులు నష్టపోవడమే కాకుండా యావత్ ప్రపంచాన్ని ప్రమాదంలో పడేశారని వాపోతున్నారు.