Thinnest skyscraper: ప్రపంచంలోనే సన్న భవనం ఎక్కడుందో తెలుసా.. అందులో ఒక్కో అపార్ట్‌మెంట్ ధర ..

ప్రపంచంలో అద్భుత కట్టడాలు ఎన్నో ఉన్నాయి. పొడువైన భవనాలు, సన్నటి భవంతులు, ఆకాశాన్ని తాకుతుందా అన్నరీతిలో భవనాలు ప్రపంచంలో కోకొల్లలుగా ఉన్నాయి. ప్రపంచంలో అతి పొడవైన భవనంగా మనకు గుర్తుకొచ్చేది బుర్జ్ ఖలీఫా. అయితే....

Thinnest skyscraper: ప్రపంచంలోనే సన్న భవనం ఎక్కడుందో తెలుసా.. అందులో ఒక్కో అపార్ట్‌మెంట్ ధర ..

New York

Thinnest skyscraper: ప్రపంచంలో అద్భుత కట్టడాలు ఎన్నో ఉన్నాయి. పొడువైన భవనాలు, సన్నటి భవంతులు, ఆకాశాన్ని తాకుతుందా అన్నరీతిలో భవనాలు ప్రపంచంలో కోకొల్లలుగా ఉన్నాయి. ప్రపంచంలో అతి పొడవైన భవనంగా మనకు గుర్తుకొచ్చేది బుర్జ్ ఖలీఫా. అయితే ప్రపంచంలో సన్నటి భవనం ఎక్కడుందో తెలుసా. అందులో ఒక్కో అపార్ట్‌మెంట్ ధర ఎంతో తెలుసా..? ప్రపంచంలోనే అత్యంత సన్నటి భవనంగా స్టెయిన్‌వే టవర్ నిలుస్తుంది. ఇది న్యూయార్క్‌లోని మాన్ హట్టన్‌లో నిర్మాణమైంది. దీని వెడల్పు కేవలం 17.5 మీటర్లు మాత్రమే. ఎత్తు 435 మీటర్లు. స్టెయిన్‌వే టవర్‌ను 111 వెస్ట్ 57వ స్ట్రీట్ అని కూడా పిలుస్తారు. ఈ భవనంలో 84 అంతస్తులు, 60 అపార్ట్ మెంట్లు ఉన్నాయి. ఈ భవనంలో ఒక్కో అపార్ట్‌మెంట్ ధర సుమారు రూ. 60కోట్లు ఉంటుంది. అదే పెంట్‌హౌస్ అయితే సుమారు రూ. 500 కోట్లపైమాటే.

ఈ సన్నని భవనాన్ని న్యూ‌యార్క్ ఆర్కిటెక్చర్ కంపెనీ షాప్ డిజైన్ చేసింది. జేడీఎస్ డెవలప్మెంట్, ప్రాపర్టీ మార్కెట్స్ గ్రూప్ అండ్ స్ర్పూప్ క్యాపిటల్ పార్టనర్స్ 2013లో ఈ భవన నిర్మాణాన్ని ప్రారంభింది. ఇక్కడ 25 మీటర్ల స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ డైనింగ్ రూమ్ వంటి విలాసవంతమైన సౌకర్యాలతో భవన నిర్మాణం జరిగింది. డబుల్ హైట్ ఫిట్‌నెస్ సెంటర్‌లో టెర్రస్ కూడా ఉంటుంది. ఒకప్పుడు మాన్‌హట్టన్‌లో సాంస్కృతిక కేంద్రంగా ఉన్న స్టెయిన్‌వే హాల్‌కు సూపర్ టాల్ టవర్ అదనంగా ఉంది. 1925లో నిర్మించిన స్టెయిన్‌వే హాల్, ఒక కచేరీ హాల్‌గా, పియానో ​​మేకర్ స్టెయిన్‌వే అండ్ సన్స్‌కి పూర్వ ప్రధాన కార్యాలయంగా పనిచేసింది. ఆ వేదిక అప్పటి నుండి విలాసవంతమైన నివాసాలుగా మార్చబడింది. ఇది ఇప్పుడు చాలా పొడవైన, సన్నని టవర్‌కు అనుసంధానించబడింది.

World War Three : మూడో ప్రపంచ యుద్ధం దగ్గరపడింది.. ఆ దేశాలకు రష్యా సీరియస్ వార్నింగ్

స్టెయిన్‌వే టవర్ వెడల్పు 17.5 మీటర్లు కాగా, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా 163 అంతస్తులు 45 మీటర్ల వెడల్పుతో ఉంది. అదేవిధంగా చైనాలోని పుడాంగ్ జిల్లాలో ఉన్న షాంఘై వరల్డ్ ఫైనాన్షియల్ సెంటర్ 1,614 అడుగుల (492 మీటర్లు) ఎత్తు ఉంది. అయితే దీని వెడల్పు 58 మీటర్లు. అదేవిధంగా తైవాన్‌లోని తైపీలో తైపీ 101 (తైపీ ఫైనాన్షియల్ సెంటర్) భవనం 130 మీటర్ల వెడల్పు, 1,667 అడుగుల (508 మీటర్లు) ఎత్తుతో ఉంది. ఈ సన్నటి భవనంకు దగ్గర్లోనే ప్రపంచంలోనే అతి పొడవైన నివాస భవనం ‘సెంట్రల్‌ పార్క్‌ టవర్‌’ (దీని ఎత్తు 472 మీటర్లు, వెడల్పు 28.5మీటర్లు) ఉంది.