Trump’s Twitter Account: ట్రంప్ ట్విట్టర్‌ ఖాతాను పునరుద్ధరించిన మస్క్.. ఫాలోవర్లు మాత్రం..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను ఆ సంస్థ సీఈవో, కొత్త యజమాని ఎలాన్ మస్క్ పునరుద్ధరించారు. నిన్న తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఎలాన్ మస్క్ పోల్ నిర్వహించి ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలా? వద్దా? అని అడిగిన విషయం తెలిసిందే. అందులో ఓటు వేసిన వారిలో 51.8 శాతం మంది పునరుద్ధరించాలని, 48.2 శాతం మంది వద్దని ఓట్లు వేశారు. కాగా, ట్రంప్ ఖాతాను పునరుద్ధరించినప్పటికీ ఆయనకు గతంలోలా మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ప్రస్తుతం లేరు.

Trump’s Twitter Account: ట్రంప్ ట్విట్టర్‌ ఖాతాను పునరుద్ధరించిన మస్క్.. ఫాలోవర్లు మాత్రం..

Trump's Twitter Account

Donald Trump’s Twitter Account : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను ఆ సంస్థ సీఈవో, కొత్త యజమాని ఎలాన్ మస్క్ పునరుద్ధరించారు. నిన్న తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఎలాన్ మస్క్ పోల్ నిర్వహించి ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలా? వద్దా? అని అడిగిన విషయం తెలిసిందే. అందులో ఓటు వేసిన వారిలో 51.8 శాతం మంది పునరుద్ధరించాలని, 48.2 శాతం మంది వద్దని ఓట్లు వేశారు. ఎలాన్ మస్క్ నిర్వహించిన ఈ పోల్ లో మొత్తం 1,50,85,458 మంది పాల్గొన్నారు.

ఎక్కువ మంది ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించాలనే ఓట్లు వేయడంతో చివరకు ఎలాన్ మస్క్ అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ‘‘ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలని ప్రజలు చెప్పారు. ప్రజల గళమే దేవుడి గళం’’ అని ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.

ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ ఇటీవలే కొనుగోలు చేశారు. ట్రంప్ ఖాతాను ఆయన పునరుద్ధరిస్తారని అప్పటినుంచీ ప్రచారం జరుగుతోంది. గత ఏడాది జనవరి 6న కాపిటల్ హిల్ పై దాడి జరగడంతో ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై జీవితకాల నిషేధం విధించారు. ఆ దాడికి ట్రంప్ రెచ్చగొట్టేలా చేసిన ట్వీట్లే కారణమని ఆరోపణలు వచ్చాయి. కాగా, ట్రంప్ ఖాతాను పునరుద్ధరించినప్పటికీ ఆయనకు గతంలోలా మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ప్రస్తుతం లేరు.

అప్పట్లో రాజకీయ నేతల్లో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న నేతగా ట్రంప్ ఉండేవారు. ఇప్పుడు ఆయన మళ్ళీ ఫాలోవర్లను సంపాదించుకోవాల్సి ఉంది. అయితే, తన ట్విట్టర్ ఖాతాను ట్రంప్ మళ్ళీ వాడతారా? అన్న సందేహాలూ ఉన్నాయి. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరిస్తున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించిన కొద్దిసేపటికే ట్రంప్ ఖాతా కనపడింది. ట్రంప్ చివరిసారిగా 2021, జనవరి 8న ట్వీట్ చేశారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ట్రంప్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కాగా, ట్విట్టర్ సంస్థను కొనుగోలు చేసిననాటి నుంచి ఉద్యోగుల తొలగింపులు, బ్లూ టిక్ ధ్రువీకరణ, ట్రంప్ ఎంట్రీలాంటి వివాదస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు మస్క్.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..