Super-Earth TOI-1452 b : భూమికంటే 70 రెట్లు పెద్ద ‘మహాభూమి’ .. అక్కడ సంవత్సరం అంటే 11 రోజులే…

భూమి అంటే మన భూమికంటే 70 రెట్లు పెద్దగా ఉన్న గ్రహాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఇది రెండు నక్షత్రాల చుట్టూ తిరుగుతోంది అని గుర్తించారు. ఇది రెండు నక్షత్రాల చుట్టూ తిరుగుతోందని, ఇక్కడ సంవత్సరం అంటే కేవలం 11 రోజులు మాత్రమేనని చెబుతున్నారు శాస్త్రవేత్తలు..

Super-Earth TOI-1452 b : భూమికంటే 70 రెట్లు పెద్ద ‘మహాభూమి’ .. అక్కడ సంవత్సరం అంటే 11 రోజులే…

Super-Earth TOI-1452 b

Super-Earth TOI-1452 b : విశ్వాన్ని జల్లెడ పడుతున్న ఖగోళ శాస్త్రవేత్తలు ఏదోక వింతలన కనుగొంటునే ఉన్నారు. వారి కృషికి ఫలితంగా మరో వింత వెలుగులోకి వచ్చింది. అదే మరో భూమి. మన జీవిస్తున్న భూమికి 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉందా మరోభూమి. భూమి అంటే మన భూమికంటే 70 రెట్లు పెద్దగా ఉన్న గ్రహం.  ఈ కొత్త భూమి రెండు నక్షత్రాల చుట్టూ తిరుగుతోంది అని గుర్తించారు శాస్త్రవేత్తలు. మాంట్రియల్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఈ మహా భూమిని గుర్తించింది. ఇది రెండు నక్షత్రాల చుట్టూ తిరుగుతోందని, ఇక్కడ లోతైన మహాసముద్రాలు ఉంటాయని, ఇక్కడ సంవత్సరం అంటే కేవలం 11 రోజులు మాత్రమేనని చెప్తోంది. దీని పేరు TOI-1452 b అని తెలిపింది. ఇది భూమి వంటి గ్రహమేనని వివరించారు.

మనం నివసిస్తున్న భూమి ఒక సూర్యుని చుట్టూ తిరుగుతోంది. కానీ TOI-1452 b మహా భూమి రెండు నక్షత్రాల చుట్టూ తిరుగుతోంది. మన భూమి నుంచి ఇది దాదాపు 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది మన భూమి కన్నా ఏకంగా 70 శాతం పెద్దది. ఐదు రెట్లు బరువైనది. దీనిలో ఓ లోతైన మహాసముద్రం ఉండి ఉండవచ్చు అని భావిస్తున్నా శాస్త్రవేత్తల బృందం. ఈ గ్రహం మొత్తం బరువులో 30 శాతం వరకు మహా సముద్రం ఉంది. మనం నివసిస్తున్న భూమిలో 70 శాతం వరకు నీరు ఉన్న సంగతి తెలిసిందే. మన భూమి బరువులో కేవలం 1 శాతం మాత్రమే నీటి ప్రాంతం ఉంది.

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం..నీరు, భూమి నిష్పత్తిని మన సౌర వ్యవస్థలోని వాటరీ మూన్స్‌తో పోల్చినపుడు, మంచు ఫలకాల క్రింద మహా సముద్రాలు ఉన్నట్లుగా ఈ మహాభూమిలోని సముద్రం కూడా ఉంది. ఈ మహాభూమి తన నక్షత్రం చుట్టూ భ్రమణాన్ని 11 రోజుల్లో పూర్తి చేస్తుంది. కాబట్టి మనకు ఒక సంవత్సరం అంటే ఈ మహాభూమి మీద సంవత్సరం అంటే 11 రోజులు మాత్రమే.

మన సూర్యుడి నుంచి శుక్ర గ్రహానికి ఏ స్థాయిలో కాంతి అందుతోందో అదే స్థాయిలో ఈ మహాభూమికి తన నక్షత్రం నుంచి కాంతి అందుతుంది. ఈ మహాభూమి తన రెండో నక్షత్రం చుట్టూ తిరగడానికి దాదాపు 1,400 సంవత్సరాలు పడుతుందట..ఎంత వింతగా ఉందో కదా..ఈ మహాభూమిలో నీరు ఉన్నట్లు నిస్సందేహంగా చెప్పాలంటే మరికొన్ని పరిశోధనలు జరగాలని చెబతోంది పరిశోధకుల బృందం.