Pakistan: పాకిస్థాన్‌లో దారుణ పరిస్థితులు.. ట్విటర్‌లో పాక్ మాజీ క్రికెటర్ ఆవేదన..

పాకిస్థాన్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఆ దేశంలో రోజురోజుకు నిత్యావసర ధరలు పెరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంకుల్లో పెట్రోల్ లేక, ఏటీఎంలలో డబ్బులు లేక అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. అయితే ఈ పరిస్థితి కారణం మీరంటే మీరంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. తాజాగా దేశంలో దారుణ పరిస్థితులను వివరిస్తూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ హపీజ్ ఆవేదన వ్యక్తం చేశారు...

Pakistan: పాకిస్థాన్‌లో దారుణ పరిస్థితులు.. ట్విటర్‌లో పాక్ మాజీ క్రికెటర్ ఆవేదన..

Pakistan Cricketar

Pakistan: పాకిస్థాన్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఆ దేశంలో రోజురోజుకు నిత్యావసర ధరలు పెరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంకుల్లో పెట్రోల్ లేక, ఏటీఎంలలో డబ్బులు లేక అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. అయితే ఈ పరిస్థితి కారణం మీరంటే మీరంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. తాజాగా దేశంలో దారుణ పరిస్థితులను వివరిస్తూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ హపీజ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో తాజా పరిస్థితులపై ట్వీట్ చేస్తూ రాజకీయ నేతలను ప్రశ్నించారు. లాహోర్ లోని బంకుల్లో పెట్రోల్ లేదని, ఏటీఎం యంత్రాల్లో నగదు అందుబాటులో లేదని పేర్కొన్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ మహమ్మద్ హఫీజ్ ట్వీటర్ లో ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నేతల నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడాలని ప్రశ్నించాడు. తన ట్వీట్ కు ప్రధాని షెహబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పాటు పలువురు రాజకీయ నేతలను ట్యాగ్ చేశాడు.

ఇదిలా ఉంటే పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన మద్దతు ధారులతో ఇస్లామాబాద్ లో ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కాగా బుధవారం అర్థరాత్రి ఇస్లామాబాద్ లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఇస్లామాబాద్‌లో శాంతిభద్రతల పరిస్థితి నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యంను మోహరించాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు గురువారం ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ లో ర్యాలీ తలపెట్టారు. భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకొచ్చారు. దీంతో పాక్ రాజధానిలో ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ లో ముందస్తు ఎన్నికలు పెట్టాలని ఇమ్రాన్, ఆయన మద్దతు ధారులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభాలపై చర్చించేందుకు గురువారం కూడా పార్లమెంట్‌ సమావేశం కానుంది. రుణ కార్యక్రమాన్ని పునఃప్రారంభించడంపై అంతర్జాతీయ ద్రవ్య నిధితో చర్చలు బుధవారం అసంపూర్తిగా ముగియడంతో ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ పరిపాలన మరింత ఒత్తిడికి గురైంది. చర్చలలో గణనీయమైన పురోగతి ఉందని IMF చెప్పినప్పటికీ, పాకిస్తాన్ చరిత్రలో ఇప్పుడు రెండవసారి డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉంది.

Pakistan : బొమ్మ తుపాకీలంటేనే వణికిపోతున్న పాకిస్థానీలు..బ్యాన్ చేయాలంటూ డిమాండ్

గత కొంతకాలంగా పాకిస్తాన్‌ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దేశంలో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వ వైఫల్యమే కారణమని పేర్కొంటూ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో నాటకీయ పరిణామాల మధ్య ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్‌ గద్దెదిగిపోవడం, ఆ తర్వాత ఏడాది ఏప్రిల్ 23న PML(N)అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌ ప్రధానిగా ఎన్నికవడం, ఆపై ఇమ్రాన్‌ తిరుగుబాటు ప్రకటించడం వంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి. షెహబాజ్‌ షరీఫ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పాకిస్తాన్‌ ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. నిత్యావసరాల ధరలు పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. . దీంతో పాకిస్తానీయుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.