గూగుల్ రూల్స్ బ్రేక్ చేసిన ఇంజనీర్‌కు రూ.1300 కోట్ల ఫైన్!!

  • Published By: veegamteam ,Published On : March 7, 2020 / 06:59 AM IST
గూగుల్ రూల్స్ బ్రేక్ చేసిన ఇంజనీర్‌కు రూ.1300 కోట్ల ఫైన్!!

గూగుల్ నిబంధనలు అతిక్రమించి మరో కంపెనీలోకి వెళ్లిపోయిన ఓ ఇంజనీర్ కు గూగుల్ సంస్థ రూ.13వందల కోట్ల జరిమానా విధించింది. దీంతో సదరు ఇంజనీర్ కళ్లు తేలేశాడు. సాధారణంగా ఒక కంపెనీలో పనిచేసే ఉద్యోగికి అంతకంటే మంచి ఆఫర్ వస్తే ఠక్కుమని ఎగిరి వెళ్లిపోతారు. కానీ ఆ వెళ్లే క్రమంలో అంతకు ముందు పనిచేసే కంపెనీకి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను తప్పకుండా పాటించాల్సిందే. లేదంటే తగిన ఫలితం అనుభవించాల్సిందే ఈ ఇంజనీర్ లాగా..

వివరాల్లోకి వెళితే..ఆంటోనీ లావన్డోస్కీ అనే వ్యక్తి గూగుల్‌లో ఇంజనీర్‌గా పనిచేసేవాడు. అతనికి ఉబర్‌ నుంచి చాలా మంచి అవకాశం వచ్చింది. దీంతో ఠక్కుమని ఉబర్ సంస్థలో వాలిపోయాడు. ఈక్రమంలో గూగుల్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ వెళ్లిపోయాడు. గతంలో ఓసారి ఆంటోనీకి 120 మిలియన్ డాలర్స్ బోనస్ గా కూడా ఇచ్చిన గూగుల్ ఊరుకుంటుందా ఏంటీ..తాట తీసింది. భారీగా ఫైన్ వేసి సదరు ఇంజనీర్ కు చెమటలు పట్టించింది. 

తమ కంపెనీలో చేరే సమయంలో ఆంటోనీ గూగుల్ విధించిన నిబంధల్ని అంగీకరించి ఉద్యోగంలో చేరాడు. కానీ ఉబర్ నుంచి మంచి ఆఫర్ రావటంతో గూగుల్ నిబంధల్ని ఖాతరు చేయకుండా వెళ్లిపోయాడు. దీంతో గూగుల్..తమ కంపెనీ రహస్యాల్ని దొంగిలించి వెళ్లిపోయాడని ఆంటోనీ పై కోర్టులో కేసు వేసింది. 
ఈ కేసు విషయంలో అతడికి ఉబర్‌ కంపెనీ లీగల్ గా ప్రొటక్ట్ చేస్తూ వచ్చింది. కానీ ఉబర్ కూడా ఆంటోని మస్కా కొట్టాడు. కొంతకాలానికి అతడు ఉబర్‌ నుంచి కూడా జంప్ అయి మరో కంపెనీకి ఎగిరిపోయాడు. 

దీంతో గతంలో గూగుల్ కు మండినట్లే ఉబర్ కు కూడా మండింది. ‌అప్పటి వరకూ ఆంటోనికి కల్పిస్తున్న లీగల్ ప్రొటక్షన్‌ను కట్ చేసుకుంది. ఈ కేసు కోర్టులో కొనసాగి.. చివరకు ఆంటోని లావన్డోస్కీకి $179 million (ఇండియా 13 వందల కోట్ల రూపాయలకు పైనే) గూగుల్‌కు చెల్లించాల్సిందిగా లావన్డోస్కీని ధర్మాసనం ఆదేశించింది. దీంతో అతడి ఎలా ఉందంటే..దురాశ దు:ఖమునకు చేటు..అన్నట్లుగా తయారైంది. మరి గూగులా మజాకా..చుక్కలు గూగుల్ రంగుల్లో కనిపించాయిగా..సదరు ఇంజనీర్‌కు!!