Giant lizard: సూపర్ మార్కెట్‌లో రాకాసి బల్లి

రీసెంట్‌గా గాడ్జిల్లా వర్సెస్ కింగ్‌కాంగ్ అందరి బుర్రల్లో తిరిగే టాపిక్ నే. ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ ఒక్కసారైనా..

Giant lizard: సూపర్ మార్కెట్‌లో రాకాసి బల్లి

Giant Lizard

Giant lizard: రీసెంట్‌గా గాడ్జిల్లా వర్సెస్ కింగ్‌కాంగ్ అందరి బుర్రల్లో తిరిగే టాపిక్ నే. ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ ఒక్కసారైనా ఆ రాకాసి బల్లిని చూద్దామని అనుకోవచ్చు. అలాంటి వారు ఓ సారి ఈ వీడియోపై లుక్కేయండి. సరదాగా వెళ్లిందో.. సందిగ్ధంలో వెళ్లిందో ఓ సూపర్ మార్కెట్ కు వెళ్లిపోయింది రాకాసి బల్లి.

థాయ్‌లాండ్‌లోని 7ఎలెవన్ స్టోర్‌లో ఈ ప్రమాదకర ఘటన జరిగింది. ఆ స్టోర్ వారు ముందుగా భయపడినా తర్వాత తేరుకుని వీడియో తీసి సోషల్ మీడియాల్లో షేర్ చేయడం మొదలుపెట్టారు. సూపర్ మార్కెట్లో ఉన్న షెల్ఫ్స్ లోకి అమాంతం ఎక్కేస్తున్న బల్లి వస్తువులన్నీ కిందపడిపోతున్నా పైకి ఎక్కగలిగింది. పైకి ఎక్కి అక్కడి నుంచి కిందకు చూస్తూ అలా పడుకుంది.

లక్షల్లో వ్యూస్ సంపాదించుకున్న ఈ వీడియోను ట్విట్టర్ డిలీట్ చేసేసింది. దీనిని ఫేస్ బుక్, యూట్యూబ్ లలో పోస్టు చేయడంతో ఇలా షేర్ అవుతుంది. బ్యాంకాక్ ప్రాంతంలో ఇలాంటి బల్లులు అనేవి కామన్. కాకపోతే సూపర్ మార్కెట్ లోకి వచ్చేయడం అరుదే. వీటి ఆహారం చనిపోయిన జంతువులను తినడం.

ఇక వీడియో విషయానికొస్తే.. ఓరి దేవుడా షెల్ఫ్ లు మొత్తం పాడవుతున్నాయి. ఎనిమిది అడుగుల బల్లి పైకి ఎక్కేస్తుంది’ అని ఒక వాయీస్ వినబడుతూ ఉంది. క్లిప్ చివర్లో బల్లి షెల్ఫ్ పైకి ఎక్కేసరికి షాప్ లో ఉన్నవాళ్లలో అప్పుడు భయం రెట్టింపు అయింది. 2016లోనూ ఇలా పెద్ద బల్లి థాయ్ లాండ్ లో కనిపించింది.

అది సేఫ్ ప్లేస్ కు వెళదామనే ప్రయత్నంలోనే అలా సూపర్ మార్కెట్ లోకి వచ్చేసింది. ఎటువంటి హాని చేయడానికి కాదని స్థానికులు చెబుతున్నారు.