Gold Rate: గుడ్ న్యూస్..! 6 నెలల కనిష్ఠానికి బంగారం ధర

అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న మార్పుల కారణంగా బంగారం ధరల్లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ఆరు నెలలుగా ఉన్న ధరలతో పోలిస్తే..

10TV Telugu News

Gold Rate: అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న మార్పుల కారణంగా బంగారం ధరల్లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ఆరు నెలలుగా ఉన్న ధరలతో పోలిస్తే.. సోమవారం నమోదైన ధరల్లో పది గ్రాముల బంగారం ధర 0.13శాతం తగ్గుదల కనిపించగా, కేజీ వెండి రూ.59వేల 427పలికి 0.16శాతం తగ్గిందన్నమాట.

అంతర్జాతీయ మార్కెట్ ధర మార్పుల కారణంగా నేరుగా 1740డాలర్లు పతనమైంది. ఫలితంగా అమ్మకాల్లో బ్రోకర్లపై ఒత్తిడి నెలకొంది. వెండి విషయంలోనూ అదే జరిగినా ఒకానొక దశలో గట్టి సపోర్ట్ దొరికింది.

అంతర్జాతీయంగా గోల్డ్ 0.3శాతం క్షీణించగా ఓన్సుకు 1748.69డాలర్లకు చేరింది. ఆగష్టు 12నుంచి నమోదైన కనిష్ట మార్కెట్ స్థాయి ఇదే. అమెరికా బంగారం 0.1శాతానికి తగ్గి 1749డాలర్లకు పడింది. డాలర్ ఇండెక్స్ ఒక నెల గరిష్ఠానికి చేరుకుని.. బంగారం పెట్టుబడిదారులకు, ఇతరులను ఒత్తిడిలోకి నెట్టేసింది.

ర్యూటర్స్ అనే ఇంగ్లీష్ మీడియా కథనం ప్రకారం.. యూఎస్ ఫెడ్ సెప్టెంబర్ 21-22 సమయంలో నెలవారీ బాండ్లను తగ్గించే అవకాశం ఉంది. సెప్టెంబర్ తర్వాత మాత్రమే అసలైన మార్పులు కనిపిస్తాయి. దీంతో పాటు అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ సైతం తాజా ఎకనమిక్ ప్రొజెక్షన్స్ విడుదల చేయడంతో వడ్డీ రేట్లపై ప్రభావం కనిపించనుంది.