Hawaii wildfire : హవాయి ద్వీపంలో కార్చిచ్చు…53 కు పెరిగిన మృతుల సంఖ్య, వెయ్యి భవనాలు దగ్ధం

అమెరికాలోని హవాయి ద్వీపంలోని అడవుల్లో భీకర కార్చిచ్చు రాజుకుంది. ఈ మంటల్లో 53 మంది సజీవ దహనమయ్యారు. హవాయి ద్వీపమైన మౌయ్‌లో గురువారం జరిగిన అడవి మంటల విధ్వంసంలో పలు ప్రాంతాలు కాలి బూడిదగా మారాయి....

Hawaii wildfire : హవాయి ద్వీపంలో కార్చిచ్చు…53 కు పెరిగిన మృతుల సంఖ్య, వెయ్యి భవనాలు దగ్ధం

Hawaii wildfire

Updated On : August 11, 2023 / 6:24 AM IST

Hawaii wildfire : అమెరికాలోని హవాయి ద్వీపంలోని అడవుల్లో భీకర కార్చిచ్చు రాజుకుంది. ఈ మంటల్లో 53 మంది సజీవ దహనమయ్యారు. హవాయి ద్వీపమైన మౌయ్‌లో గురువారం జరిగిన అడవి మంటల విధ్వంసంలో పలు ప్రాంతాలు కాలి బూడిదగా మారాయి. హవాయి ద్వీపంలో పర్యాటకులు సందర్శించే స్థలాలన్నీ నల్లటి శిథిలాలతో బూడిదగా మారాయి. (Hawaii wildfire)ఈ కార్చిచ్చు ప్రభావం వల్ల నౌకాశ్రయంలోని పడవలు కాలిపోయాయి.

Nuclear Weapons : ఉత్తర కొరియా అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోంది…యూఎన్ సంచలన నివేదిక

బుధవారం అర్థరాత్రి హవాయిలోని కిహీలో రాజుకున్న అడవి మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో వెయ్యికి పైగా భవనాలు కాలి బూడిదగా మారాయని హవాయి గవర్నర్ జోష్ గ్రీన్ చెప్పారు. (1,000 structures burnt) 1961వ సంవత్సరంలో వచ్చిన సునామీ వల్ల 61 మంది మరణించారు. నాటి విపత్తు తర్వాత రాజుకున్న కార్చిచ్చు వల్ల భారీగా ప్రాణ నష్టం జరిగింది.

Prime Minister Narendra Modi : మణిపుర్‌పై మోదీకి అమెరికా గాయని మేరి మిల్‌బెన్ మద్ధతు

హరికేన్ గాలుల తీవ్రత వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. కార్చిచ్చు బారి నుంచి తప్పించుకునేందుకు కొంతమంది సముద్రంలోకి దూకారు. భవనాల్లో మంటలు వ్యాపించి సైరన్ మోగడంతో తాము ద్వీపంలోని ప్రధాన విమానాశ్రయానికి తరలి వచ్చానని బోస్కో బే చెప్పారు. కార్చిచ్చుతో అలముకున్న దట్టమైన పొగ విషపూరితం కావడంతో పలువురు వాంతులు చేసుకొని మృత్యువాత పడ్డారు.