Britain PM Rishi Sunak : ఆసుపత్రిలో రోగులను పరామర్శించిన రిషి సునక్ .. మహిళా రోగి మాటలకు షాక్ అయిన కొత్త ప్రధాని

ఆసుపత్రిలో రోగులను పరామర్శించారు బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునక్. ఈ సందర్భంగా ఓ మహిళా రోగి మాటల తీవ్రతకు రిషి షాక్ అయ్యారు.

Britain PM Rishi Sunak : ఆసుపత్రిలో రోగులను పరామర్శించిన రిషి సునక్ .. మహిళా రోగి మాటలకు షాక్ అయిన కొత్త ప్రధాని

77 Years old Woman patient challenges Bbritain PM Rishi Sunak over nurses Salaries pay

Britain PM Rishi Sunak : బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న రిషి సునక్ బ్రిటన్ సమస్యలనుంచి గట్టెక్కించటానికి కఠిన నిర్ణాయాలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపిన విషయం తెలిసింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బ్రిటన్ ను చక్కపెట్టే క్రమంలో పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. పెను సవాళ్లు అంటే ఆర్థిక విషయాలు ఒక్కటే కాదు. ప్రజల నుంచి వచ్చే విమర్శలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అసహనాలను..సూచనలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈక్రమంలో రిషి సునక్ ప్రధాని అయ్యాక ఓ ఆస్పత్రిని సందర్శించి రోగులను పరామర్శించారు. అలా రోగులను పరామర్శిస్తుండగా ఓ మహిళా రోగి నుంచి రిషి సునక్ కు ఊహించని పరిణామం ఎదురైంది.

సునాక్ శుక్రవారం (అక్టోబర్ 28,2022) సౌత్ లండన్‌లోని క్రొయిడన్ యూనివర్సిటీ ఆసుపత్రిని సందర్శించారు. హాస్పిటల్ సిబ్బందితో నవ్వుతూ సెల్ఫీలు దిగారు. అక్కడ 77 ఏళ్ల కేథరీన్ పూలే అనే ఓ మహిళా రోగిని పరామర్శిస్తూ.. ఆసుపత్రి సిబ్బంది ఎలా చూసుకుంటున్నారని అడిగారు. దానికామె బాగానే చూసుకుంటున్నారని తెలుపుతూ.. ఆసుపత్రి సిబ్బందిని చూస్తుంటే చాలా జాలిగా ఉందని..ఎందుకంటే వారికి ప్రభుత్వం చాలా తక్కువ జీతాలు ఇస్తోందని రిషి సునక్ తో తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది ముఖ్యంగా నర్సులు రోగులకు చేసే సేవలకు..వారికి ప్రభుత్వం ఇచ్చే జీతాలను ఏమాత్రం సంబంధం లేదని తక్కువ వేతనాలు..ఎక్కువ బాధ్యతలతో వారు ఇబ్బందులు పడుతున్నారంటూ వివరించారు. వారిని చూస్తుంటే జాలేస్తోందని అన్నారు. నర్సుల వేతనాలు పెంచాలని కొత్త ప్రధాని రిషిని కోరారు సదరు మహిళా రోగి.

ఆమె మాటలకు రిషి సమాధానమిస్తూ..దాని కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెబుతుండగా దానికి ఆమె రిషి మాటల మధ్యలోనే కల్పించుకుని చూపుడు వేలు చూపిస్తూ..ప్రయత్నించడం కాదు..ఇచ్చి తీరాలి అని కాస్త తీవ్రంగానే అనడంతో రిషి సునక్ ఆశ్చర్యపోయారు. వెంటనే తేరుకున్న ఆమె తప్పకుండా అంటూ బదులిచ్చారు. ఆయన ఆస్పత్రి నుంచి తిరిగి వెళ్లిపోతూ..కేథరీన్ పూలే వద్దకు నవ్వుతూ వచ్చి ఈ విషయాన్ని మీరు నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు..మీరు ఆరోగ్యంగా ఇంటికి వెళ్లాలను కోరుకుంటున్నాను అని వెళ్లిపోయారు.

కాగా..తమ జీతాలు పెంచాలని కోరుతూ సమ్మె చేయాలని దాదాపు 3 లక్షల మంది నర్సింగ్ సిబ్బంది నిర్ణయించారు. దీంట్లో భాగంగా ఓటింగ్ కూడా నిర్వహించారు. సమ్మెకు వెళ్లేందుకు ఓటింగ్ నిర్వహించడం ఈ శతాబ్ద కాలంలో బ్రిటన్‌లో ఇదే తొలిసారి కావటం విశేషం. దీనికి ఇటీవల బ్రిటన్ లో భారీగా పెరిగిన ఆర్థిక సంక్షోభం కూడా కారణం.

పెరిగిపోతున్న ధరలకు తోడు, ఉద్యోగంలో చేరినప్పటి నుంచి వేతనాల్లో పెరుగుదల లేదని, అందుకే ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చిందని రాయల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెలిపింది. జాతీయ వైద్య సేవల కింద బ్రిటన్‌లో 1948 నుంచి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ సేవలకు కేటాయించిన బడ్జెట్‌లో మూడింట ఒక వంతును ఆరోగ్య సేవల కోసమే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.