India : యుక్రెయిన్‌కు రష్యా బలగాలను తరలించడంపై భారత్ అభ్యంతరం

యుక్రెయిన్‌లో ఉన్న భారతీయుల సంక్షేమమే తమ ధ్యేయమని భారత్ తెలిపింది. శాంతికి విఘాతం కలగకుండా చూడాలని భారత్ విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని కోరింది.

India : యుక్రెయిన్‌కు రష్యా బలగాలను తరలించడంపై భారత్ అభ్యంతరం

India

India object : యుక్రెయిన్‌ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో పాటు రష్యా దూకుడుపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా వైఖరిపై ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో రష్యా వైఖరిని భారత్‌ తప్పుపట్టింది. యుక్రెయన్‌కు రష్యా బలగాలను తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అన్ని వర్గాలు సంయమనం పాటించాలని భారత్ పిలుపునిచ్చింది. పరిస్థితులు చేయిదాటిపోతే ప్రమాదమంటూ ఆందోళన వ్యక్తం చేసింది.

యుక్రెయిన్‌లో ఉన్న భారతీయుల సంక్షేమమే తమ ధ్యేయమని భారత్ తెలిపింది. శాంతికి విఘాతం కలగకుండా చూడాలని భారత్ విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని కోరింది. యుక్రెయిన్‌లో ఉన్న 20వేలకు పైగా భారతీయ విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించి సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు అన్ని వర్గాలు పనిచేయాలని భారత్ సూచించింది.

Russian President Putin: యుక్రెయిన్‌పై సర్జికల్ స్ట్రైక్.. పుతిన్ సంచలన నిర్ణయం.. రెండు ప్రత్యేక దేశాలుగా!

యుక్రెయిన్‌‌ ఆక్రమణ విషయంలో రష్యా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో ఓవైపు సైన్యాలను మోహరించి.. వేర్పాటువాదులకు సహకరిస్తోంది. తూర్పు యుక్రెయిన్‌లో రెండు వేర్పాటువాద ప్రాంతాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించారు. పశ్చిమ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రష్యా అధ్యక్షుడు ఈ ప్రకటన చేశారు.

డొనెట్స్క్‌, లుహాన్స్క్‌లను స్వతంత్ర దేశాలుగా గుర్తించినట్టు పుతిన్‌ చెప్పారు. చాలా కాలంగా వినిపిస్తున్న ఈ రెండు ప్రాంతాల స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారాన్ని తక్షణమే గుర్తించడం కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని తాను నమ్ముతున్నానన్నారు. వేర్పాటువాదులతో పరస్పర సహకారం, స్నేహపూర్వక ఒప్పందాలపై పుతిన్ సంతకం చేశారు.