జపాన్ లో చెర్రీ పూల సందడి..70 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ముందుగానే పూసి కనువిందు చేస్తున్న చెర్రీ పూలు..

జపాన్ లో చెర్రీ పూల సందడి..70 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ముందుగానే పూసి కనువిందు చేస్తున్న చెర్రీ పూలు..

Japanese Cherry Blossoms

Japanese cherry blossoms : జపాన్ దేశంలో చెర్రీపూలు ముందుగానే పూసి కనువిందు చేస్తున్నాయి. చెర్రీ పూల అందాలు చూపు తిప్పుకోనివ్వటంలేదు. గత 70 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి చెర్రీ పూలు వికసించాయి. చూపు మరల్చుకోనంత దట్టంగా పూశాయి. ఈ చెర్రీ పూలను చూడటానికి సందర్శకులు భారీ సంఖ్యలో వచ్చి ఆస్వాదిస్తున్నారు. సువాసనలు వెదజల్లుతూ సందర్శకులను వేరే లోకంలోకి తీసుకెళ్లిపోతున్నాయి.

2

సాధారణంగా చెర్రీ పూలు ఏప్రిల్‌లో పూస్తాయి. కానీ ఏడాది మాత్రం ఎప్పుడూ లేనంతగా మార్చిలోనే పూశాయి. దీనికి కారణం జపాన్‌ వాతావరణంలో వచ్చిన మార్పులేనంటున్నారు నిపుణులు. జపాన్‌లో ఏటా 2 వారాలపాటూ చెర్రీ చెట్లకు పూలు పూస్తాయి. ఐతే… గత 70 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి త్వరగానే పూలు వికసించేశాయి. అలా ఎందుకు జరిగింది అంటే వాతావరణ మార్పులే కారణం అంటున్నారు. ఈ చెర్రీ చెట్ల పూలను సకురా అంటారు.

6

జనరల్‌గా ఇవి ఏప్రిల్‌లో పూస్తాయి. సరిగ్గా అప్పుడే జపాన్‌లో స్కూళ్లు ప్రారంభమవుతాయి. పిల్లలు స్కూళ్లకు వెళ్తుంటే దారంతా చెర్రీ పూలు చక్కటి రంగులతో కనువిందు చేస్తాయి. చిన్నారల మనస్సుల్లాగానే అవికూడా చాలా అందంగా కనిపించి రంజింపచేస్తాయి. మనసుకు హాయిగొలిపే సువాసనలు వెదజల్లుతూ… చెట్లపై నుంచి చెర్రీ పూలు రాలుతూ వేరే లోకంలో ఉన్నామా అనే ఫీల్ కలిగిస్తాయి.

7

చుట్టూ ఎటుచూసినా తెలుపు, గులాబీ రంగు చెర్రీ పూలే చెట్ల నిండా కనిపిస్తాయి. అదో అద్భుతం లోకంలా ఉంటుంది. ఈసారి మాత్రం స్కూళ్లు ప్రారంభం కాకముందే చెర్రీపూలు పూసేశాయి. దీంతో సందర్శకులు వచ్చి ఆ పూలను..ఆ సువాసనలను ఆస్వాదిస్తున్నారు. ఫోటోలు..సెల్ఫీలు తీసుకుంటూ ఆనంద పడిపోతున్నారు.

9

ఏప్రిల్ నెలలో పూసే చెర్రీ పూలు ఈ సంవత్సరం మార్చి 26కే అంటూ నెలాఖరుకే విరగబూశాయి.ప్రాచీన నగరం క్యోటో మొత్తం చెర్రీ పూల అందాలతోనూ..సువ్వాసనలతోను నిండిపోయింది. ఇలా గత 70 ఏళ్లలో ఎప్పుడూ కూడా మార్చి నెలలో పూయలేదని…ఎప్పుడో 1953లో జరిగిందంటున్నారు. అప్పుడు కూడా 10 రోజులు ముందుగానే పూలు పూశాయట. ఇప్పుడు జపాన్‌లోని దాదాపు 2 నగరాల్లో ఇలా ముందుగానే పూలు పూసి మనస్సుని పులకరింపజేస్తున్నాయి.

10

ఈ పూలు ముందుగా పూయటంతో వాతావరణంలో జరిగే మార్పులపై చరిత్రకారులు లోతుగా అధ్యయనం చేశారు. 1612, 1409, 1236లో కూడా ఇలాగే త్వరగా పూలు పూశాయని ఒసాకా ప్రిఫెక్చర్ యూనివర్శిటీ పర్యావరణ శాస్త్రవేత్త యసుయుకీ ఔనో తెలిపారు.భూతాపం పెరటం వల్లే ఇలా ముందుగా పూశాయని కొంత మంది పర్యావరణ వేత్తలు భావిస్తున్నారు. జపాన్ వాతావరణ విభాగంలోని అధికారి షుంజీ అన్బే కూడా ఇదే కారణం అంటున్నారు.

4

జపాన్‌లో చెర్రీ పూలు దట్టంగా పూసే చెట్లు 58 చెట్లు ఉన్నాయనీ.. వాటిలో 40 చెట్లకు ముందుగానే చెర్రీ పూలు వచ్చేయని అంటున్నారు. ఆ పూలు ఇప్పుడు రాలిపోయే దశలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈ చెట్లు 2 వారాలపాటూ పూలు పూస్తాయి. జపాన్‌కి ఎక్కడ లేని అందాన్ని..ఆనందాన్ని కలిగిస్తాయి. చెర్రీ పూల అందాలను చూడటానికి ఆ అందమైన సీనరీలను షూట్ చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ఫొటోగ్రాఫర్లు జపాన్‌కి తరలివస్తారు. వారి కెమెరాలలో చెర్రీ పూల సొగసుల్ని బంధింటానికి పోటీలు పడతారు.

11

చెర్రీ చెట్లు చాలా సున్నితంగా ఉంటాయి. వాతావరణం ఏమాత్రం మారినా చలించిపోతాయి. అంటే ఈ పూలు ఎత అందమో..అంత సుకుమారమైనవి కూడా..జపాన్ వాతావరణ విభాగం డేటా ప్రకారం క్యోటోలో మార్చిలో 2020లో 10.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండగా… 1953లో అది 8.6 డిగ్రీల సెల్సియస్ మాత్రమే ఉండేది.

12

ఈ సంవత్సరం మార్చిలో ఉష్ణోగ్రత 12.4 డిగ్రీల సెల్సియస్ వచ్చింది. అంటే వాతావరణంలో వేడి పెరిగినట్లే. ఇది ప్రమాదకర సంకేతమే నంటున్నారు విశ్లేషకులు. ప్రమాదమో ప్రమోదమో గానీ చెర్రీ పూల అందాలను మాత్రం సందర్శకులు మనసారా ఆస్వాదిస్తున్నారు.