జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్ సింగిల్ షాట్ చాలు : ఎఫ్డీఏ

జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్ సింగిల్ షాట్ చాలు : ఎఫ్డీఏ

johnson johnson

Johnson and Johnson vaccine: జాన్సన్ అండ్ జాన్సన్ తయారుచేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ ఒక్క డోస్ చాలు మంచి ఎఫెక్ట్ చూపిస్తుందని అంటున్నారు. ఎటువంటి సీరియస్ సమస్యలు రాకుండా బయటపడగలమని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కొత్త అనాలసిస్ చెప్తుంది. వ్యాక్సిన్ ఆథరైజేషన్ పొందడానికి ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉందని ఏజెన్సీ వెల్లడించింది.

రివ్యూ చేయడానికి 3 వారాల సమయం:
జాన్సన్ అండ్ జాన్సన్ సబ్‌మిట్ చేసిన డేటా రివ్యూ చేయడానికి ఎఫ్డీఏకు మూడు వారాల సమయం పట్టింది. యునైటెడ్ స్టేట్స్, దక్షిణాఫ్రికా, లాటిన్ అమెరికాలలో కంపెనీ క్లినికల్ ట్రయల్ నిర్వహించింది. దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్ లో నమోదైన కొవిడ్-19 కేసులపై 80శాతం ఎఫెక్టివ్ గా పనిచేసింది. వ్యాక్సిన్ డోస్ తీసుకున్న ఏ ఒక్కరూ 28రోజుల లోపు హాస్పిటల్ కు రాలేదని, కొవిడ్ కారణంగా చనిపోలేదని రికార్డులు చెబుతున్నాయి.

vaccine death
యునైటెడ్ స్టేట్స్‌లో 72శాతం ఎఫెక్టివ్‌గా
యునైటెడ్ స్టేట్స్ లో వ్యాక్సిన్ 72శాతం ఎఫెక్టివ్ గా పనిచేసిందని ఎఫ్డీఏ చెప్తుంది. షాట్ వేసిన 28రోజుల వరకూ ఎఫెక్టివ్ గా పనిచేసింది. దక్షిణాఫ్రికాలో 64శాతం తక్కువ ఎఫెక్ట్ చూపించింది. వేరియంట్లను బట్టి వ్యాక్సిన్ తీవ్రత పనిచేసిందని అంటున్నారు. జనవరి చివరి వారంలో వ్యాక్సిన్ రిజల్ట్స్ బయటకు చెప్పింది. మిగిలిన చోట్ల ఎఫెక్టివ్ గా పనిచేసినా దక్షిణాఫ్రికాలో మాత్రం 58శాతం తగ్గిపోయింది.

60-indians-still-hesitant-towards-covid-19-vaccine-shows-survey1
1000మందిపై 71రోజుల పాటు
జాన్సన్ అండ్ జాన్సన్ కొత్త డేటా రిలీజ్ చేసి.. 1000మందిపై 71రోజుల పాటు చేసిన క్లినిక్ ట్రయల్ ను తెలియజేసింది. కరోనావైరస్ నుంచి పోరాడటానికి వారిలో యాంటీబాడీస్ ఉత్పత్తి ఎలా జరిగిందని అందులో వెల్లడైంది. వారిలో యాంటీబాడీలు ప్రొడ్యూస్ అయి ఉన్నాయంటే వారు వైరస్ ఇన్ఫెక్షన్ ఎదుర్కొన్నట్లే.

jophnson

jophnson


ప్రస్తుతం జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ను ఫైజర్/బయో ఎన్టెక్, మోడర్నాలతో పోల్చడం కష్టమే. అవన్నీ రెండు డోస్ లు వేసుకోవాల్సి ఉన్నా జాన్సన్ వ్యాక్సిన్ మాత్రం సింగిల్ షాట్ తో పనైపోతుంది. పైగా ఇది సాధారణ ఫ్రిడ్జ్ లలో స్టోర్ చేసుకోవచ్చు. 18ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్న వారు దీనిని వాడేందుకు ఆథరైజేషన్ ఇవ్వాలని ఆ సంస్థ అడుగుతుంది. ఎఫ్డీఏ నుంచి ఫిబ్రవరి 27కల్లా అనుమతి దొరుకుతుందని భావిస్తున్నారు.